పొద్దున్నే లేస్తూనే ఏదో అసహనంగా, బద్దకంగా అనిపిస్తోంది. అదే అలసట కుర్చీలోంచి లేచినప్పుడు కూడా అనిపిస్తుంది. శరీరంలోని రక్తమంతా మెదడుకు వెళ్లిపోయి, ఇంకెక్కడా లేని భావన కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు శరీరంలో అనిపిస్తుంటే మీ బీపీ సాధారణ స్థాయి కన్నా తక్కువున్నట్టే. దీనికి సత్వర చికిత్స అవసరం. ఇందుకోసం కొన్ని మంచి మంచి గృహ చిట్కాలు చూద్దాం.
లో బీపీకి కారణాలు అనేకం వీటిలో ముఖ్యమైనవిః
- డీహైడ్రేషన్- తద్వారా వాంతి, విరేచనాలు
- బ్లీడింగ్- మంద్రస్థాయి నుంచి తీవ్ర స్థాయి దాకా
- అవయవాల వాపు, నొప్పి
- గుండె రుగ్మతలు- గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డకట్టడం లాంటివి
- హై బీపీ కోసం మందులు వేసుకోవడం మూలాన
- బీ 12 విటమిన్ లోపం వల్ల
- అడ్రినలైన్ హార్మోన్ సరైన మోతాదులో లేనందు వల్ల
- సెప్టిసీమియా
- వేసో వ్యాగల్ రియాక్షన్ల వల్ల
- పోస్టురల్ హైపోటెన్షన్ వల్ల
- మద్యం సేవించడం వల్ల
- మాదకద్రవ్యాలను అతిగా సేవించడం వల్ల
సాధారణ బీపీ అంటే 120/80 గా ఉంటే చాలు. 130/80 బీపీ ఉంటే ఎక్కువగా ఉన్నట్టు అర్థం. లో బీపీలో ఈ సంఖ్యల కన్నా లక్షణాలను బట్టే నిర్ధారిస్తారు. అయితే 100/60 కన్నా తక్కువ ఉంటే లో బీపీగా వ్యవహరించవచ్చు.
విటమిన్లు:
ఈ విటమిన్లను బాదంపప్పు, పాలకూర, స్వీట్ పొటాటో, గుడ్లు, పాలు, చీజ్, చేపల్లో పుష్కలంగా ఉంటాయి. దీనికి అదనంగా వైద్యుడి సలహాతో విటమిన్ ట్యాబ్లెట్లను కూడా తీసుకోవచ్చు.
కాఫీ:
గ్రీన్ టీ:
రోజ్‌మేరీ నూనె:
ఉప్పు నీళ్లు:
బీపీ పడిపోయినట్టు అనిపించినప్పుడల్లా ఇది తాగండి. ఉప్పులో ఉండే సోడియం బీపీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఎక్కువ మొత్తంలో ఉప్పు నీరు తాగకూడదు. ఎక్కువ ఉప్పు శరీర ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.