గర్భిణులు వికారం నుండి ఉపశమనం పొందడానికి సులువైన పద్ధతులు

ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాంతులు రావడం సర్వ సాధారణం. ఈ టైమ్‌లో ప్రయాణాలు చేయడం, యాసిడ్ రిఫ్లక్స్ కారణాల వల్ల వికారం మరింత ఎక్కువ అవుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇలా జరిగితే, మీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది.

Tips to prevent vomiting and dizziness in pregnant womenతరచుగా త్రేన్పులు రావడం, నిలబడలేకపోవడం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి, వికారం నుండి ఉపశమనానికి మీరు ప్రయత్నించగల సాధారణ గృహ చిట్కాలను చూద్దాం..

నీళ్ళు:

Tips to prevent vomiting and dizziness in pregnant womenవాంతులు, తల తిరగటం తో బాధపడే గర్భిణులు ఎక్కువగా నీళ్ళు తాగాలి, డీహైడ్రేషన్ కారణంగా వికారం, వాంతులు కూడా అవుతాయి. కాబట్టి, ఒకే సారి ఎక్కువ నీళ్ళు తాగకుండా, ఒక రోజుకురెండు లీటర్ల అప్పుడప్పుడు కొద్దికొద్దిగా రోజంతా తాగుతూనే ఉండాలి. ఇతర స్వీట్ డ్రింక్స్ తాగకూడదు.

అల్లం:

Tips to prevent vomiting and dizziness in pregnant womenచాలా మంది గర్భిణీ మహిళల్లో సహజంగా వచ్చే వికారం వాంతులకు నేచురల్ రెమడీ అల్లం, అల్లంలో ఉండే జింజరోల్ అనే కంటెంట్ వాంతులను వికారం తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం మంచిది.

ఒత్తిడి తగ్గించుకోవాలి:

Tips to prevent vomiting and dizziness in pregnant womenకొన్ని సందర్భాల్లో స్ట్రెస్ వల్ల కూడా మార్నింగ్ సిక్ నెస్ పెరగుతుంది. సాధ్యమైనంత వరకూ గర్భిణీలు ఒత్తిడి తగ్గించుకోవాలి, యోగ, మెడిటేషన్ వంటివి చేసి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి.

ఆక్యుప్రెజర్ :

Tips to prevent vomiting and dizziness in pregnant womenపి6 లేదా వ్రిస్ట్ ఆక్యుప్రెజర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని, చాలా పరిశోధనల్లో కనుగొన్నారు. ఆక్యుప్రెజర్ వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. ఆక్యుప్రెజర్ అనేది వైద్యపరమైనది, కొన్ని శరీర బాగాల్లో ఒత్తిడి కలిగించడం వల్ల వికారం, వాంతులు తగ్గించుకోవచ్చు.

విశ్రాంతి:

Tips to prevent vomiting and dizziness in pregnant womenమార్నింగ్ సిక్నెస్ కు మరో ముఖ్యమైన లక్షణం గర్భణీలో తరచూ మూడ్ మారుతుంటుంది, దీన్నే మూడ్ స్వింగ్స్ అని అంటారు. అలా జరగకుండా ఉండాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. విశ్రాంతితో పాటు, నిద్రకూడా ఉండాలి. అలసట ఎప్పుడూ సిక్నెస్ కు దారితీస్తుంది.

ఆహారంలో క్వాంటింటి తగ్గించాలి:

Tips to prevent vomiting and dizziness in pregnant womenరోజుకు మూడు సార్లు తీసుకునే ఎక్కువ భోజనంను 5, 6 సార్లుగా కొద్దిగా కొద్దిగా తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, వికారం వాంతులు ఉండవు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న బ్రెడ్ వంటివి మీ ఆరోగ్యానికి మంచిది కొన్ని సందర్భాలలో భోజనం స్కిప్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ కు కారణమవుతుంది.

పుదీనా:

Tips to prevent vomiting and dizziness in pregnant womenగర్భిణీల్లో వాంతులను నివారించడానికి పుదీనా గ్రేట్ రెమెడీ, ఇది బాడీ హీట్ తగ్గిస్తుంది, మనస్సును ప్రశాంత పరుస్తుంది, ఏదైనా చల్లగా తీసుకోవలనే కోరిక పెంచుతుంది. పెప్పర్ మింట్ ఆకలు తినడం, లేదా పిప్పర్మెంట్ టీ తాగడం, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమలడం వల్ల వాంతులు, సిక్ నెస్ నుండి కొంత ఉపశమనం కలుగుతుంది.

హెర్బల్ రెమెడీస్:

Tips to prevent vomiting and dizziness in pregnant womenమార్నింగ్ సిక్నెస్ తగ్గించుకోవడానికి హెర్బల్ రెమెడీస్ సహాయపడుతాయి.చమోమెలీ, లెమన్ బామ్, ఇతర లోజెన్స్ వంటివి వికారంను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ఆరోమా థెరఫీ:

ఆరోమా థెరఫీగర్భిణీల మైండ్ ను రిలాక్స్ చేయడంలో ఆరోమా థెరఫీ బాగా సహాయపడుతుంది. అదే విధంగా, మార్నింగ్ సిక్నెస్ వల్ల దెబ్బతిన్న శ్వాసనాళాలను ఉత్తేజపరుస్తుంది.

దాల్చిన చెక్క:

Tips to prevent vomiting and dizziness in pregnant womenదాల్చిన చెక్కలో వికారం, వాంతులు తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి, దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ తాగడం, లేదా దాల్చిన చెక్ వాసన చూడటం , లేదా ఆవిర పట్టడం వల్ల వికారం వాంతులు తగ్గుతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR