దీర్ఘకాల వెన్నునొప్పిని చిటికెలో తగ్గించే చిట్కాలు! 

మనం నిల్చుంటున్నాం, కూర్చోగలుగుతున్నాం అంటే దానికి కారణం వెన్నెముక. ఆరోగ్యానికీ ప్రతీకగా నిలిచేదే వెన్నెముక. ఇది తనంతట తానే నడిచే నాడీమండల భాగం. ఇది చాలా కీలకమైనదే కాకుండా అత్యంత నున్నితమైనది కూడా. పూసలు పూసలు ఏర్పాటైన మానవ వెన్నుపాము మనిషి చేసే ప్రతి పని దీనిమీదే ఆధారపడి ఉంటది. దీని ఈ వెన్నుపాము చుట్టూ బలమైన కండరాలు చుట్టుకొని ఉంటాయి.
దృఢమైన వెన్నువూసలతో నిర్మితమైన ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన బాధకు దారితీస్తాయి. గతంలో వృద్ధాప్యంలో వచ్చిన వెన్నునొప్పి సమస్య ప్రస్తుతం వయోపరిమితి లేకుండానే చాలా ప్రబలంగా ఉందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి మన లైఫ్‌స్టైల్‌. కొవిడ్‌ వల్ల ఏడాదిన్నర పాటు ఇంట్లో ఉండి ఎక్కువ గంటలు పని చేయడం వల్ల కూడా వస్తోంది.
కరోనా లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న విషయం తెలిసిందే. అలా వర్క్ చేసే వారిలో సగనికిపైగా ఉద్యోగులు ఒత్తిడికి గురై వెన్ను నొప్పితో బాధపడుతన్నట్టు ఒక సర్వేలో తేలింది. కొందరికి అది దీర్ఘకాలిక నొప్పిగా మారే అవకాశం ఉన్నదున్న అవగాహనా తప్పని సరి అంటున్నారు వైద్యులు.
అనేక కారణాల వల్ల వెన్నునొప్పి వేధిస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా ఈ సమస్య అంత త్వరగా తగ్గదు. అలాంటప్పుడు కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. చాలా మంది ఉద్యోగులకు, రోజు బరువులు ఎత్తేవారికి వెన్ను నొప్పి రావడం సహజం. సాధారణ వెన్ను నొప్పి అయితే నేలపై సమాంతరంగ పడుకొవడం, కొన్ని వ్యాయమ సూచనలు పాటిస్తే తగ్గిపోతది. కానీ అది దీర్ఘకాలిక నొప్పిగా మారితే చాల నష్టాలు వస్తాయి.
సాధారణంగా ఎక్కువ గంటలు ఈ కండరాలపై బరువు పడితే అవి వ్యాకోచిస్తాయి. ఇది అలానే కొనగితే దీర్ఘకాలిక నొప్పిగా మారే అవకాశం ఉంది. చాలాచెపు వెన్ను స్టైన్ అయ్యేలా పని చేయకండి. ముఖ్యంగా బరువులు మోసే వాసరికి, చాలా సేపు కదల కుండా ఒకే దగ్గర వంకరగా కూర్చోవడం వల్ల వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కుల మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది.
దీనివల్ల భవిష్యత్లో సరిగా నిలపడలేకపోవడం, కండరాల నొప్పులు, సున్నిత భాగాలలో నొప్పులు, శరీరం నిరసించిపోవడం, ఆడవారికి గర్బధారణ సమస్యలు, మూత్ర విసర్జన సమస్యలు, శృంగారంలో పట్టు కోల్పోవడం, నడుస్తున్నపుడు కాళ్లు తొణకడం లాంటి రుగ్మతలు వస్తాయి. ఈ లాంటి సమస్యలకు సంబందించిన లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదురుకోక తప్పదు.
అలాగే ఈ ఎక్సర్సైస్ తో పాటు వెన్నునొప్పిని సహజంగా తగ్గించుకోవడానికి ఉత్తమమైన మార్గం ఆహారంలో మార్పులు చేయడం. నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం పొందడానికి శోథనిరోధక పదార్థాలు ఉన్న ఆహారాన్ని వెంటనే మానేయాలి. గంటల తరబడి కూర్చోవడాన్ని, అలాగే కదలకుండా ఒకే చోట కూర్చోవడం మానేయాలి. కలక్రమేణా ఇది వెనుకభాగంపై ఒత్తిడిని పెంచుతుంది. తద్వారా వెన్నునొప్పి ఎక్కువగా వస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,520,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR