పులిపిర్లు ఎలా ఏర్పడతాయి? నివారణ మార్గాలు

చర్మంపై ఏర్పడే పులిపిర్లు చాలామందిని పులిపిర్లు వేధిస్తుంటాయి. జనాభాలో ప్రతి వందమందిలోనూ కనీసం 10-15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. ఎక్కువగా యుక్త వయస్కుల్లో కనిపిస్తాయి. మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖం భాగంలో పులిపిర్లు ఏర్పడితే మాత్రం వాళ్ల బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. ఎందుకంటే.. పులిపిర్లు అందాన్ని పాడు చేస్తాయి. ముఖం మీద అంద వికారంగా కనిపిస్తాయి.

Tips To Remove Warts Permanentlyపులిపిర్లు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి. అవి ఎక్కడ, ఎప్పుడు పుడుతాయనేది కచ్చితంగా చెప్పడం కష్టం.

Tips To Remove Warts Permanentlyరోగనిరోధక శక్తి లోపించినప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు కొన్ని రకాల వైరస్‌లు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో కొందరికి పులిపిర్లు ఏర్పడతాయి. అయితే వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతివారిలోనూ వస్తాయని చెప్పలేం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి లోనై రోగనిరోధక శక్తి లోపించినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే పులిపిర్లు వస్తాయి. పులిపిరులకు ప్రధాన కారణం వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్). శరీరంలో చెమట ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఎక్కడైతే శుభ్రత ఉండదో.. ఆ ప్రాంతంలో.. చెమట వల్ల ఓ వైరస్ ఉత్పత్తి అవుతుంది. దాన్నే హ్యూమన్ పాపిలోమా అని అంటారు. అలా.. ఆ వైరస్.. చర్మం మీద పెరుగుతూ.. పెరుగుతూ.. పులిపిరిగా మారుతుంది. అందుకే.. రోజుకు రెండు సార్లు స్నానం చేయాలని పెద్దలు చెబుతుంటారు.

Tips To Remove Warts Permanentlyపులిపిర్లను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. చేతి వేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అని అంటారు. పాదాలపై వచ్చే పులిపిర్లను ప్లాంటార్ వార్ట్స్ అంటారు. ముఖం, మెడ మీద వచ్చే పులిపిర్లను ఫ్లాట్ వార్ట్స్ అని అంటారు. కొంతమందికి జననాంగాలపై కూడా ఇవి ఏర్పడతాయి. వాటిని జనైటల్ వార్ట్స్ అని పిలుస్తారు. సాధారణంగా పులిపిర్లతో ఏ సమస్య ఉండదు కాని కొన్నిసార్లు నొప్పి, దురద, రక్తం కారటం వంటి ఇబ్బందులు ఉండవచ్చు. పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వలన మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటి చిట్కాలు లేదా వైద్యులను సంప్రదించి వీటిని మటుమాయం చేయొచ్చు.

Tips To Remove Warts Permanentlyపులిపిర్లు జీవితంలో ఎప్పుడూ రాకుండా ఉండాలంటే కొన్ని అవిసె గింజలను తీసుకొని.. వాటిని మొత్తగా రుబ్బి పేస్ట్ లా చేయండి. ఆ తర్వాత దానికి కాసింత తేనె కలపి, పులిపిర్లు ఉన్న చోట ఆ మిశ్రమాన్ని రుద్దండి. తర్వాత.. దాని చుట్టు చిన్న బ్యాండేజ్ వేయండి. అలాగే ఆ బ్యాండేజ్ ను కొన్ని రోజుల పాటు ఉంచండి. కొన్ని రోజుల తర్వాత ఆ బ్యాండేజ్ ను తీస్తే దానితో పాటు పులిపిరి కూడా రాలిపోతుంది.

Tips To Remove Warts Permanentlyఒకవేళ మీకు అవిసె గింజలు దొరక్కపోతే.. మన వంటింట్లో ఉండే వెల్లుల్లిని తీసుకోండి. వెల్లుల్లిని పేస్ట్ గా చేసి.. పులిపిర్ల మీద రాయండి. వెల్లుల్లి పేస్ట్ ను రుద్దిన తర్వాత.. దాని మీద బ్యాండేజ్ వేయండి. కొన్ని రోజుల్లోనే పులిపిరి రాలిపోతుంది. ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయండి. అలా రాత్రంతా వదిలిపెట్టండి. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేసినట్లయితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.

Tips To Remove Warts Permanentlyకలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందుకు మీరు కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే చాలు. లేదంటే.. ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా చేసుకొని వెనిగర్ లో వేసి రాత్రంతా వెనిగర్ లో ఉంచి.. ఉదయం లేచాక ఆ వెనిగర్ ను పులిపిర్ల మీద రుద్దండి. కర్పుర తైలం తీసుకొని దాని కూడా పులిపిర్లు ఉన్న చోట రుద్దండి. ఆముదం అందుబాటులో ఉంటే.. దాన్ని కూడా రుద్దొచ్చు.

Tips To Remove Warts Permanentlyఆలు గడ్డ కూడా పులిపిర్లను తొలగిస్తుంది. చిన్న ఆలు గడ్డ ముక్క తీసుకొని.. దాన్ని పులిపిర్ల మీద రుద్దండి. ఇంకా పైనాపిల్ ముక్కను తీసుకొని పులిపిర్ల మీద రుద్దుండి. లేదా పైనాపిల్ రసాన్ని కూడా పులిపిర్ల మీద రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR