1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.![01 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/01-Tirupathi.jpg)
![01 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/01-Tirupathi.jpg)
2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.![02 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/02-Tirupathi.jpg)
![02 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/02-Tirupathi.jpg)
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.![03 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/03-Tirupathi.jpg)
![03 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/03-Tirupathi.jpg)
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.![04 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/04-Tirupathi.jpg)
![04 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/04-Tirupathi.jpg)
5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.![05 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/05-Tirupathi.jpg)
![05 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/05-Tirupathi.jpg)
6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.![06 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/06-Tirupathi.jpg)
![06 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/06-Tirupathi.jpg)
7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.![07 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/07-Tirupathi.jpg)
![07 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/07-Tirupathi.jpg)
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.![08 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/08-Tirupathi.jpg)
![08 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/08-Tirupathi.jpg)
9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.![09 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/09-Tirupathi.jpg)
![09 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/09-Tirupathi.jpg)
10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.![10 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/10-Tirupathi1.jpg)
![10 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/10-Tirupathi1.jpg)
11. క్రీ.శ.1800 సం.లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.![11 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/11-Tirupathi1.jpg)
![11 Tirupathi](http://wirally.com/wp-content/uploads/2017/08/11-Tirupathi1.jpg)
గోవిందా గోవిందా
![](https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif)