అసలు గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే….?

ఇటీవలకాలంలో సంభవించే అత్యధిక మరణాలు గుండె వ్యాధుల వలనే ఉంటున్నాయి. గుండె సంబంధిత సమస్యలు.. విపరీతంగా పెరిగిపోయి చాలా మంది మృత్యువాత పడటం గమనార్హం. ఈ మధ్యకాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు గుండె సమస్యతో చిన్న వయసులోనే ప్రాణాలు విడవడం ఎంతో మందిని కలిచి వేసింది. మన శరీరంలో అన్ని అవయవాలూ ముఖ్యమైనవే. కానీ గుండె, కిడ్నీలు, లివర్ వంటి వాటిని అత్యంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అవి ఆరోగ్యంగా ఉన్నాయో లేదో మనకు తెలీదు. మన చేతులూ, కాళ్లలాగా అవి మన కంటికి కనిపించవు కదా. కాబట్టి… వాటి విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

heart wellకానీ ప్రస్తుత బిజీ లైఫ్ మరియు తినే ఆహారం, అలాగే జీవనశైలి ఇలా అనేక రకాల కారణాల వల్ల… మనకు గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతున్నాయి. అయితే వీటిని మొగ్గ దశలోనే ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం… మనం మనం అనేక రకాల చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. గుండె జబ్బులకు కారణం రక్త సరఫరాలో వచ్చే అవరోధాలే . గుండెకు సరిగ్గా రక్త సరఫరా లేకపోవడం, నరాల్లో కొవ్వు పేరుకుపోవడం వంటి వాటితో గుండెకు ముప్పు వాటిల్లుతోంది. గుండెల్లో నొప్పి, గుండె పట్టేసినట్టు ఉండడం వంటి లక్షణాలు రాబోయే తీవ్ర అనారోగ్యాలకు సూచికలకుగా భావించాలి.

heart problemsదానితో పాటు మంచి ఆహారం తినాలి. ఎక్కువ పోషకాలు, విటమిన్లూ, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటివి ఉండేవారు… ఇంకా ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. అధిక బరువు ఉండేవారికి కూడా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. వీరు ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు పండ్లు మరియు కూరగాయలు తీసుకుంటే చాలా ఆరోగ్యకరం. వీటిని తీసుకోవడం కారణంగా అనేక పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి. తద్వారా మనం గుండె సమస్యలను కూడా తగ్గి పో తాయి.

fruitsఆకలిగా అనిపించినప్పుడు రెండు బిస్కెట్లో, ఆలూ చిప్సో తినడం అందరూ చేసే పనే. కానీ, ఇందులో ఉండే కేలరీలు చాలా ఎక్కువ. ప్రాసెస్ చేసిన బిస్కెట్స్ లాంటివి వాటిలో ట్రాన్స్-ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం హై బ్లడ్ కొలెస్ట్రాల్‌కి దారి తీస్తుంది. అంతేకాక, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకని, కుకీస్, బిస్కెట్స్, కేక్స్ వంటివి కొనేటప్పుడు వాటిలో ఉన్న ట్రాన్స్-ఫ్యాట్ లెవెల్స్ లేబుల్ మీద చూసి కొనమని నిపుణుల సలహా.

bajraఫ్రైలు, కేకులు, చాకొలెట్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ టేస్టీగా ఉంటాయి. కానీ వీటిలో కొవ్వు ఎక్కువ. అది మన గుండెకు ప్రమాదకరం. ఇవి ఎక్కువగా తింటే… మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరల్లో గడ్డలుగా గూడుకడతాయి. ఏదో ఒక రోజు అదే కొవ్వు… రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అంతే హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. అందు వల్ల మనం డేంజర్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. అవసరమైతే నోరు కట్టేసుకోవాలి. అప్పుడప్పుడూ తింటే పర్లేదు గానీ… రోజూ అలాంటివి తింటే… గుండెకు చేటే.

curdఅలాగే తరుచూ ఆహారంలో తృణ ధాన్యాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. రైస్‌, గోధుమలతోపాటూ రాగులు, జొన్నలు, సజ్జల వంటివి ఈమధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి అవి అన్నీ తినాలి కూడా. వాటిలోనూ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వచ్చేసింది. అది రేటు ఎక్కువైనా మన శరీరానికి చాలా మంచిదే. బ్లడ్ ప్రెజర్ ని రెగ్యులేట్ చేసి గుండె ఆరోగ్యం గా ఉండేటట్లు చూడడంలో హోల్ గ్రెయిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఫైబర్, న్యూట్రియెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. రెఫైండ్ గ్రెయిన్స్ బదులు హోల్ గ్రెయిన్స్ వాడితే హార్ట్ హెల్దీగా ఉంటుంది.

coronary artery diseaseఆకుకూరలు, కూరగాయలలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. పండ్లూ కూరగాయలూ ఎక్కువ తీసుకోవడం వల్ల మీట్, చీజ్, ప్రాసెస్డ్ స్నాక్స్ వంటివి తీసుకునే ఛాన్స్ తగ్గుతుంది. ఇక ఓట్స్ మనం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికీ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో ఉండే పీచుపదార్థం శరీరంలోని కొవ్వును గ్రహిస్తుంది. దీనివల్ల రక్తంలో కొవ్వు స్థాయి తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

sproutsపెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. దీనివల్ల గుండె సురక్షితంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే రోజూ కనీసం నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు 20 శాతం తగ్గుతుందని పరిశోదనలు చెబుతున్నాయి. సరైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం తప్పనిసరిగా చేస్తే మనం బరువు తగ్గవచ్చు. ఇలా ప్రతి ఒక్క వ్యాయామము గాని.. ఆహారపు అలవాటు గానీ మనం సరైన రీతిలో చేస్తే… మనం సులభంగా బరువు తగ్గుతాం. తద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR