15 Tollywood Movies Which Made Huge Money By Using Sankranti’s Vibe

సంక్రాంతి పండుగకి దాదాపు అందరూ తమ సొంత ఊర్లకి వెళ్ళి కుటుంబాలతో గడుపుతుంటారు. ఆ తరువాత జాతర్లకు వెళ్ళడం.. కోడి పందాలు ,గుండాటలు వంటివి ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. అయితే ఇక్కడ జాతర మొదలవడానికి ముందో సినిమా.. అలాగే సాయంత్రం జాతర ముగిసాక మరో సినిమా చూస్తుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇదే టైం టేబుల్ ఫాలో అవుతుంటారు. అయితే జాతర్లకు వెళ్ళకపోయినా.. కుటుంబంతో సినిమాలకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ సినిమా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రతీ హీరో సంక్రాంతి సీజన్ కు తమ సినిమాని విడుదల చెయ్యాలని ఆశ పడుతుంటాడు. అలా అని ఆశపడినంత మాత్రాన ఆ సీజన్ ను క్యాష్ చేసుకుంటాడు అని చెప్పలేము. కానీ సంక్రాంతికి విడుదలయ్యే ప్రతీ సినిమాకి బీభత్సమైన హైప్ క్రియేట్ అవుతుంటుంది. థియేటర్ల కోసం నిర్మాతలు కొన్ని నెలల ముందునుండీ కర్చీఫ్ వేసుకుని కూర్చుంటారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ సంక్రాంతి సీజన్లో విడుదలై అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఖైదీ నెంబర్ 150 :

150మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన 150వ చిత్రం.. సంక్రాంతి కానుకగా విడుదలై 104 కోట్ల షేర్ ను రాబట్టింది. 2017 లో జనవరి 11న విడుదలైన ఈ చిత్రం… ఇప్పటికీ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది.

2) ఎఫ్ 2:

F2వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై 84.51 కోట్ల షేర్ ను రాబట్టి.. నెంబర్ 2 ప్లేస్ లో ఉంది.

3) వినయ విధేయ రామ :

Vinaya Videya Ramaరాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన డిజాస్టర్ చిత్రం ‘వినయ విధేయ రామ’. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం 63.4 కోట్ల షేర్ ను రాబట్టింది.

4) అజ్ఞాతవాసి :

Agnatha Vasiపవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ముందు నుండీ ఉన్న క్రేజ్ కారణంగా 57.3 కోట్ల షేర్ ను వసూల్ చేసింది.

5) నాన్నకు ప్రేమతో :

Nanaku Prematoఎన్టీఆర్ 25 వ చిత్రంగా వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై 55.7 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. అయితే ఈ చిత్రం యావరేజ్ గానే నిలిచింది.

6) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు :

Svscవెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ … 2013 సంక్రాంతి కానుకగా విడుదలై 51.8 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

7) గౌతమీపుత్ర శాతకర్ణి :

Gauthami Putra Satakarniబాలకృష్ణ 100 వ చిత్రంగా వచ్చిన హిట్ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. 2017 సంక్రాంతి కానుకగా విడుదలై 50.4 కోట్ల (టాక్స్ లేకుండా) షేర్ ను రాబట్టింది. బాలయ్య కెరీర్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం అని చెప్పాలి.

8) సోగ్గాడే చిన్ని నాయన :

Soggade Chininayana‘కింగ్’ నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం 2016 సంక్రాంతి కానుకగా విడుదలై 49.5 కోట్ల షేర్ ను రాబట్టి.. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

9) ఎవడు :

Evaduరాంచరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన ‘ఎవడు’ చిత్రం.. 2014 సంక్రాంతి కానుకగా విడుదలై 48.3 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని ఎక్కువ బడ్జెట్ తో మరియు ఎక్కువ రేట్లకి అమ్మడంతో ఎబౌవ్ యావరేజ్ గా మాత్రమే నిలిచింది.

10) నాయక్ :

Nayakరాంచరణ్ డబుల్ రోల్ లో నటించిన ‘నాయక్’ చిత్రం.. 2013 సంక్రాంతి కానుకగా విడుదలై 47 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

11) అరుంధతి :

Arundhatiఅనుష్క ప్రధాన పాత్రలో..దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన విజువల్ వండర్.. ‘అరుంధతి’ చిత్రం 2009 సంక్రాంతి కానుకగా విడుదలై ఏకంగా 43(అన్ని భాషలు కలుపుకుని) కోట్ల షేర్ ను రాబట్టింది.

12) గోపాల గోపాల :

Gopala Gopalaపవన్ కళ్యాణ్,వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ‘ఓ మై గాడ్’ రీమేక్ ‘గోపాల గోపాల’ చిత్రం.. 2015 సంక్రాంతి కానుకగా విడుదలై 42.10 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని 48 కోట్లకు అమ్మారు కాబట్టి.. యావరేజ్ గానే పరిగణించాలి.

13) బిజినెస్ మేన్ :

Business Manమహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం హిట్ ‘బిజినెస్ మేన్’ చిత్రం 2012 సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

14) శతమానం భవతి :

Satamanam Bhavathiశర్వానంద్, సతీష్ వేగేశ్న కాంబినేషన్లో వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రం 2017 సంక్రాంతి కానుకగా విడుదలై.. 32.7 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

15) జై సింహా :

Jai Simhaనందమూరి బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ చిత్రం.. 2018 సంక్రాంతి కానుకగా విడుదలై 29.2 కోట్ల షేర్ ను రాబట్టి .. హిట్ గా నిలిచింది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR