Home Health ఊరగాయలు తినడం వలన ఇన్ని బెనిఫిట్సా?

ఊరగాయలు తినడం వలన ఇన్ని బెనిఫిట్సా?

0
  • మన భారతీయ వంటకాల్లో ముఖ్యంగా తెలుగు వారి వంటకాల్లో ఊరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంకా చెప్పాలంటే ఊరగాయలకు భారతదేశం పెట్టింది పేరు. మన భారతీయులు పెట్టే ఊరగాయ అంటే విదేశీయులు సైతం ఎగబడతారు. అలాంటి ఈ ఊరగాయలు, పచ్చళ్ళు ఎక్కువగా నిల్వ ఉండే పదార్థాలు. చాలామంది ఈ ఊరగాయలతో భోజనం చేయకపోతే, వారికి అసలు తిన్నట్లే వుండదు.
1
  • ఊరగాయ రంగు, రుచి చూడగానే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. ఒకసారి రుచి చూస్తే నాలుకను ఆ రుచికి బానిసను చేసుకుంటుంది. భోజన సమయంలో తినడానికి ఎన్ని కొత్త రకాల వంటకాలు ఉన్నా ఊరగాయతో ఒక్క ముద్ద తింటే చాలు.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే. పేదవారైనా, ధనికులు అయినా పచ్చడి ముందు సమానమే అన్నట్లుగా అందరూ ఎంతో ఇష్టంగా పచ్చడితో అన్నం తింటారు.
  • ఈ ఊరగాయలు రకరకాల కూరగాయలతో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని కాయలతో కూడా ఈ ఊరగాయ పెడతారు. నిజానికీ పచ్చళ్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. కానీ, పండ్లు, కూరగాయలతో నిల్వ చేసే పచ్చళ్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఆరోగ్యాన్ని ఇస్తుందట. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు ఈ బ్యాక్టీరియా మేలు చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.
  • సాధారణంగా మామిడి, టమాట, దోస, అల్లం, చింతపండు వంటి కూరగాయలతో పచ్చళ్లు పెడుతుంటారు. ఇందులో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. పైగా పచ్చళ్లు తయారు చేయడానికి వాడే ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు, నువ్వులు, వేరుశెనగ నూనె శరీరానికి మేలు చేస్తాయి.
  • అయితే బయట కొనుగోలు చేసే పచ్చళ్లను తింటుంటే వాటిని మానేయడం మంచిది ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి. అలానే ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటి వాటిని కూడా అందులో యాడ్ చేస్తారు. కనుక వీలైనంత వరకూ ఇంట్లో తయారు చేసుకునే వాటిని తినడం మంచిది. మన అమ్మమ్మలు నానమ్మలు పచ్చళ్ళు ఊరబెట్టేటప్పుడు నూనె వేసి మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతులు ఇలా పచ్చడి ని బట్టి పదార్ధాలని ఉపయోగిస్తూ ఉంటారు.
  • అయితే ఈ మెంతులు జీలకర్ర ధనియాలు మొదలైన వాటిలో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. ఈ యాంటి మైక్రోబియల్ గుణాలు ఇంట్లో తయారు చేసే పచ్చడికి మాత్రమే ఉంటాయని అంటున్నారు. వీటిని నిత్యం తీసుకోకపోయినా, తరచూ కొద్ది మొత్తంలో తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు..
  • ఊరగాయలను స్వల్ప మొత్తంలో రోజూ తీసుకోవడం వల్ల విటమిన్ కె సమృద్ధిగా లభిస్తుంది. ఎముకల దృఢత్వానికి సహాయపడి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా వీటిలో ఉండే విటమిన్ ఏ గర్భవతులకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే కంటి చూపు మెరుగు పడే అవకాశాలు కూడా ఎక్కువ. అంతే కాకుండా ఎటువంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు. కండరాల నొప్పుల వాళ్లకు మంచి ఔషధంగా ఈ ఊరగాయలు పనిచేస్తాయి.
  • ఊరగాయల్లో ఉండే క్యాల్షియం శరీరంలోని ఎముకలకు, దంతాలకు మంచిగా పని చేస్తుంది. దంత సమస్యలు కానీ ఎముకల సమస్యలు కాని దరిచేరవు. కూరగాయల్లో ఉండే పొటాషియం నాడీమండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా నాడులు సక్రమంగా వాటి విధులను నిర్వర్తిస్తాయి. ఊరగాయ తినడం వల్ల మరో బెనిఫిట్ ఏంటంటే.. ఇందులోని మెంతి పిండి కారణంగా పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
  • ఊరగాయ తినడం వల్ల లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందట. తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైన్లుగా నిపుణులు గుర్తించారు. ఎందుకంటే.. ఊరగాయ తయారీల్లో నువ్వుల నూనె ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, ప్రోటీన్స్, విటమిన్ బి, ఖనిజాలు, పీచు, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దాంతో నిల్వ పచ్చళ్లలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కొలెస్టరాల్ అదుపులో ఉంటుంది. అంతే కాకుండా లైంగిక సమస్యలను దూరం చేసే ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు
  • అంతేకాకుండా ఊరగాయలను నిల్వ ఉంచడం వల్ల అవి ఎక్కువగా పులియబడతాయి. కనుక వీటిలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. తద్వారా తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. కాబట్టి ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే ఊరగాయలను ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం ఎంతో అవసరం. కానీ రోజుకు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఊరగాయను ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.

Exit mobile version