మన పూర్వీకుల నుండి రాగి వాడుకలో ఉంది. మానవుడు ఉపయోగించిన తొలి లోహం రాగి. దీని వల్ల మనకు పలు ప్రయోజనాలున్నాయి. రాగి ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అని కూడా పిలుస్తారు. రాగి మంచి ఉష్ణవాహకం, విద్యుత్తు వాహకంగా కూడా పనిచేస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఖనిజాలను అందించడం సహా రాగి వస్తువులు ధరించడం ద్వారా పలు ప్రయోజనాలున్నాయి.
సాధారణంగా చాలా మంది బంగారం లేదా వెండితో తయారు చేసిన ఆభరణాలను ధరిస్తుంటారు. అవి విలువైనవి కనుక వాటిని ధరించేందుకే చాలా మంది ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే ఆరోగ్యం పరంగా చెప్పాలంటే మనం రాగితో తయారు చేసిన ఆభరణాలను ధరించాలి. రాగితో తయారు చేసే కడియాలు, ఉంగరాలు.. ఇలా రాగితో తయారు చేసిన ఆభరణాలను ధరించాల్సి ఉంటుంది.
రాగితో తయారు చేసిన ఆభరణాలను ధరించడం వల్ల వాటిలో ఉండే రాగి కొద్ది కొద్దిగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. రాగితో తయారైన ఆభరణాలను ధరిస్తే మన శరీరంలో చేరే రాగి ఇతర మినరల్స్ ను శోషించుకునేందుకు సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఐరన్, జింక్ శరీరానికి లభిస్తాయి.
రాగి కడియాలు లేక రాగి బ్రేస్‌లెట్ ధరించిన వారికి జీర్ణ సంబంధ సమస్యలు, కీళ్ల సమస్యలు తగ్గుతాయి. కడియం, ఏదైనా రాగి సంబంధిత ఆభరణాలు, వస్తువులు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాగి ఉంగరానికి ఆయుర్వేద శాస్త్రంలోను ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో రాగి ఉంగరాన్ని స్వచ్ఛమైన, పవిత్రమైన ఉంగరంగా భావిస్తారు. ఈ ఉంగరాన్ని సూర్యుడు, అంగారకుడిపై చెందిన లోహంగా భావిస్తారు. సూర్యుడు వల్ల కలిగే వ్యాధులను ఈ రాగి ఉంగరం నయం చేస్తుంది.
కేవలం రాగి ఉంగరమే కాదు రాగి పాత్రలను ఉపయోగించిన ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలు ఉన్నాయి. మన పెద్దలు సైతం రాగి బిందెల్ని వాడేవారు. రాగితో తయారుచేసిన కడియాలు ధరిస్తే రోగనిరోధ శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగు పరచడంలో రాగి దోహదం చేస్తుంది. సూర్యకిరణాల ద్వారా విడులయ్యే కాంతి, శక్తి కిరణాలను అనుకూల శక్తిగా మారుస్తుందని సైతం విశ్వసిస్తారు. చర్మం, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలను కొంతమేర నివారిస్తుంది.
రాగి ఉంగరం రక్తపోటు, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ఇక తరచూ తలనొప్పితో భావించే వారికి రాగి ఉంగరం వల్ల ఉపశమనం కలుగుతుంది. రాగి ఉంగరం ఎముకలకు కావాల్సినంత బలాన్ని ఇస్తుంది. వాపులు వంటి వాటిని కూడా రాగి ఉంగరం తగ్గించేస్తుంది. శరీరంలో ఉండే నొప్పులను పూర్తిగా తగ్గించి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ ఉంగరం ధరించడం వల్ల రక్తం కూడా సరిగ్గా ప్రవహిస్తుంది. అలా కావడం వల్ల రక్తం శుభ్రంగా మారుతుంది.
మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల వల్ల రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దాన్ని తొలగించేందుకు రాగి ఉపయోగపడుతుంది. అందువల్ల రాగితో తయారు చేసిన ఆభరణాలను ధరించాలి. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు, నెలసరి సమస్యలు ఉన్న మహిళలు రాగి ఆభరణాలను ధరిస్తే మంచిది. అలాగే గ్యాస్, అసిడిటీ లాంటివి కూడా అదుపులో ఉంటాయి. చర్మం కూడా మృదువుగా, కాంతివంతగా మారుతుంది.
రాగి పాత్రలో ఉంచిన నీరు తీసుకుంటే మరింత ప్రయోజనం. నిజానికి రాగి పాత్రలను ఆరోగ్యానికి మాత్రమే కాకుండా వాస్తు దోషాలు కూడా దూరం అవుతాయి. ఇంటి గుమ్మం ముందు రాగి నాణెం వేలాడదీయడం వల్ల వాస్తు దోషం తొలిగిపోతుంది.