పవిత్రమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠం ఈ ఆలయమని చెబుతారు. శ్రీశైలానికి సిద్దవటం, త్రిపురాంతకం, ఉమా మహేశ్వరంలు దక్షిణ, తూర్పు, ఉత్తరద్వారాలుగా ఉండగా ఈ ఆలయం పశ్చిమ ద్వారంగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లా, అలంపురం మండలం లో తుంగభద్రానది తీరంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం జోగులాంబదేవి ఆలయం. ఈ ఆలయం శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా బావించబడుచున్నది. దేశంలోని 18 శక్తి పీఠాలలో 5 వ శక్తి పీఠం ఈ జోగులాంబదేవి ఆలయం. జోగుళాంబాదేవిగా కొలువై ఉన్న అమ్మవారి పేరుతో కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పురాణం ప్రకారం, పరమశివుని భార్య సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో ఖండించినప్పుడు మన పవిత్ర భారత భూమిపై ఆ శరీరపు 18 ఖండములు పడిన చోటులే అష్టాదశ శక్తిపీఠములు. అయితే దేశంలోని అపూర్వశక్తి సంపన్నమైన శక్తి పీఠాలలో ఇది ఒకటి అన్న విషయం లోక విదితము.ఇక ఆలయ విషయానికి వస్తే, జోగుళాంబా అమ్మవారి ఆలయం ప్రాచీనమైనది. క్రీ. శ. 7వ శతాబ్దంలో ఈ ప్రాచీనాలయం నిర్మించారని చారత్రకుల భావన. 9వ శతాబ్దంలో శ్రీ శంకర భగవత్పాదుల వారు శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసినట్టు తెలుస్తున్నది. 14వ శతాబ్దంలో జరిగిన ముస్లిం దండయాత్రల కాలంలో ఈ ప్రాచీన దేవాలయం ధ్వంసం అయినందువల్ల అమ్మవారి మూల మూర్తిని బ్రహ్మేశ్వ రాలయంలోని ఒక మూలలో ప్రతిష్టించి పూజలు జరిపించారు. ఇంకా అనేక ఆలయాలు ధ్వంసం కాకుండా విజయనగర చక్రవర్తి రెండో హరిహరరాయల కుమారుడు మొదటి దేవరాయలు తన తండ్రి ఆజ్ఞ పాటించి ఆ ముస్లిం సైన్యాన్ని పారగొట్టి దేవాలయాల్ని రక్షించాడు. అయితే తిరిగి ఆ స్థలంలోని ప్రాచీన ఆలయ వాస్తు రీతిలో నూతన ఆలయం నిర్మించి తిరిగి అమ్మవారి ప్రతిష్ఠ జరిపించడం విశేషం. ఈ నూతన ఆలయం పైకప్పుపై పద్మం, నాగంవంటివి మిగతా ఇక్కడి ఆలయాల్లో ఉన్నట్టే చెక్కడానికి ప్రధాన కారణం నాగం కుండలినీ శక్తికి, పద్మం సహస్రారానికి సంతాేలు కావడమేనని పెద్దల అభిప్రాయం. ఆలయ స్తంభాలపై అష్టాదశ, శక్తిపీఠాలలో కొలువైన అమ్మవార్ల శిల్పాలు కూడా చెక్కి ఈ శక్తి పీఠ ప్రాశస్త్యాన్ని మరింత శక్తివంతం చేశారు.పౌరాణిక ప్రమాణాలను బట్టి ఇక్కడ నవబ్రహ్మల ఆలయాలన్నట్లు తెలుస్తున్నది. బ్రహ్మ పరమేశ్వరుని గురించి తపస్సు చేసిన పవిత్ర స్థలం కావడం వల్ల ఇక్కడ ప్రధాన శివాలయమైన బాల బ్రహ్మేశ్వరాలయంతో బాటు, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ ఆలయాలు ప్రత్యేకంగా ఉండటం, ఇక్కడ క్షేత్ర పవిత్రతను మరింత పెంచాయి. ఈ శివాలయాలపై ఉన్న అనేక శిల్పాలు పౌరాణిక గాథలతో కూడి ఒక అద్భుత ప్రపంచాన్ని మనకు దృశ్యమానం చేస్తాయి. ఎందరెందరో దేశ విదేశ చరిత్రారులకు స్ఫూర్తినిచ్చేవిధంగా ఈ దేవాలయాల నిర్మాణం జరిగింది. దీనికి దక్షిణా కాశిగా సంభావిస్తుంటారు. అట్లా గుర్తించడానికి అనేక పురాణాంతర్గత సాక్ష్యాలున్నాయి. ఇది శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారం. శ్రీశైలానికి తూర్పున త్రిపురాంతకం. దక్షిణాన సిద్ధవటం, పశ్చిమాన అలంపుర, ఉత్తరాన ఉమామహేశ్వరం అనే ప్రముఖ శైవ క్షేత్రాలున్నాయని స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం చెబుతున్నది.ఇంతటి మహత్యం ఉన్న ఈ శక్తిపీఠాన్ని దర్శించుటకు అన్ని ప్రాంతాలనుండి భక్తులు తరలివస్తుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.