Home Health బియ్యం కడిగిన నీటితో జుట్టును సిల్కిగా మార్చుకోండి!

బియ్యం కడిగిన నీటితో జుట్టును సిల్కిగా మార్చుకోండి!

0

రోజూ అన్నం వండే ముందు రెండు మూడు సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ నీటిని బయట పారబోస్తుంటాం. కానీ మనం పారబోసే ఆ బియ్యం కడిగిన నీళ్లు మనకు ఎంత మేలు చేస్తాయో తెలుసుకోలేకపోతున్నాం. బియ్యపు నీటి వలన ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా బియ్యం కడిగిన నీటితో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Turn hair silky with rice wash water!ఎంతైనా ఆడవారికి కురులే కదా అందం. అందుకే జుట్టుపై చాలామంది ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. జుట్టు రకం ఏదైనా బియ్యం నీరు చక్కగా పనిచేస్తుంది. జుట్లు చిట్లడాన్ని కూడా తగ్గిస్తుంది. దానికోసం బియ్యం కడిగిన నీటిని ఒక రోజంతా పులియబెట్టి, దాన్ని తలకు రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి.

ఒకవేళ జుట్టు పొడిబారినట్లు కనిపిస్తే.. బియ్యం కడిగిన నీటిని మాడుకు జుట్టుకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. దానివల్ల జుట్టు రంగు మారదు. బియ్యం కడిగిన నీటిలో కార్బొహైడ్రేడ్లు, ధాతువులు పుష్కలంగా ఉండటంతో జుట్టుకు, చర్మానికి మేలు జరుగుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

బియ్యపు నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టును దృడంగా చేస్తాయట. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. బియ్యం నీరు తలని లోతుగా శుభ్రపరుస్తుంది. జిడ్డు లేకుండా చేస్తుంది. అంతే కాదు, పొడి, చిక్కు జుట్టు ఉన్నవారికి ఇది గొప్ప కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది.

బియ్యం నీరులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా సిల్కీగా కూడా చేస్తుంది.అంతేకాదు జుట్టుకు కావాల్సిన విటమిన్‌ కె కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది.

బియ్యం కడిగిన నీటిని రాత్రంతా అలాగే ఉంచి మర్నాడు జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ ఉంటుంది. ఈ నీటితో జుట్టును శుభ్రం చేసుకుంటే చుండ్రు, దురద లాంటి సమస్యలుంటే క్రమంగా తగ్గిపోతాయి.

 

Exit mobile version