మీకు భయం ఎక్కువా…? ఈ ఫోబియా ఉందేమో!

  • ఫోబియా అనే ఇప్పటికే చాలాసార్లు విని ఉంటారు. ఏ విషయం గురించయినా అతిగా భయపడడాన్ని ఫోబియా అంటారు.  ఉష్ణోగ్రత ఎక్కువ అయినప్పుడు తమకేదో అయిపోతుందనే భయం కొందరిలో ఉంటుంది. భయంతోనే చమటలు పట్టి నెర్వస్ అయిపోతుంటారు. దాన్నే థర్మోఫోబియా. ఈ ఫోబియా ఉన్నవారు ఉష్ణోగ్రతకు భయపడుతుంటారు.
  • ఎయిరోఫోబియా ఉన్నవారు విమాన ప్రయాణాలంటే భయపడతారు.  విమానాలకి ప్రమాదం జరిగితే అని ఊహిస్తే ఈ ఫోబియా ఉన్నట్టే లెక్క. నలుగురితో  చెప్పక పోయిన, ప్రతి ముగ్గురి లో ఒకరికి ఈ భయం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
  • ఆక్రోఫోబియా ఉన్నవారుఎత్తైన ప్రదేశాలంటే బాగా భయపడుతుంటారు. ఈ ఫోబియా ఉన్నవారికి అపార్ట్మెంట్ మీద నుండి కిందకి చూసినప్పుడు భయంతో కళ్ళు తిరిగిపోతాయి.
  • ఆర్కనోఫోబియా ఉన్నవారు  సాలీడులేదా అలాంటి ఇతర పురుగులనుకనిపించినప్పుడు భయపడతారు. ఈ ఫొబియా ఉన్న వారు పురుగుల  ఫొటో లను కూడా చూడలేరట. సైనో ఫోబియా ఉన్నవారు కుక్కలు అంటే ఎక్కువగా భయపడతారు. ఆస్ట్రాఫోబియా ఉన్నవారు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు.
  • మరికొంతమందికి తమ మీద తమకు నమ్మకం ఎక్కువగా ఉండదు. అంటే ఏదైనా ఫంక్షన్‌కు వెళితే, ఏదైనా వస్తువు తాను తస్కరించడం జరుగుతుందేమోనని భయపడతారు. అందుకే వీరు ఒంటరిగా వస్తువులు వున్న ప్రాంతానికి వెళ్ళరు. నగలదుకాణం, ఫ్యాన్సీ షాపులు, పుస్తకాల షాపు వంటి వాటి వద్దకు ఒంటరిగా వెళ్ళరు. నలుగురితో కలిసి వెళ్లి, మళ్లీ వారితో తిరిగి వచ్చేస్తుంటారు. ఎక్కడైనా, ఎవరింటికైనా వెళ్లినపుడు తాము ఎక్కడ పొరపాటున పరాయివాళ్ళ సామాన్లు దొంగిలించి పట్టుకు వచ్చేస్తామో అనే భయం కొంతమందిలో వుంటుంది. ఇలాంటివారు సాధ్యమైనంత వరకూ ఇతరులతో కలిసి వెళుతుంటారు. ఇటువంటి భయాన్ని క్లెప్ట్ఫోబియా అంటారు.
  • ఆఫిడియోఫోబియా ఉన్నవారు  పాములంటే  చాలామంది భయపడతారు. అయితే  వీరు గతంలోని అనుభవాలు, వేరే సంఘటనలో  తమను ఉంచి  ఊహించుకోవడం, చుట్టూ ఉండే పరిస్థితుల  వల్ల పాము లంటే మరింత ఎక్కువగా భయపడతారు.
  • టైపనోఫోబియా ఉన్నవారు ఇంజెక్షన్లు అంటే భయపడతారు.  ఈ భయం ఉన్న వారు హాస్పిటల్స్ అన్న డాక్టర్స్  అన్న  వెనుకడుగు  వేస్తుంటారు. అగొరాఫోబియా ఉన్నవారు  కొన్ని పరిస్థితుల్లో ఒంటరిగా ఉండేందుకు భయపడుతుంటారు.
  • మైసోఫోబియా ఉన్నవారు క్రిములు, అశుభ్రత అంటే ఎక్కువ భయపడతారు . దీని వల్ల ఎక్కువ శుభ్రం గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చిటికీ మాటికి చేతులు శుభ్రం చేసుకోవడం, వస్తువులను ఎక్కువ శుభ్రం చేయడం వంటివి చేస్తుంటారు.ఏదైనా అశుభ్రం గా ఉంటే ఆందోళన చెందుతుంటారు.
  • అమ్మాయిల వెంటబడే మనస్తత్వంగల అబ్బాయిలు ఉంటారు. అదేవిధంగా అమ్మాయిలన్నా, ఆడవారన్నా వ్యతిరేక ధోరణిలో దూరంగా పారిపోయే వారు కూడా ఉంటారు. అంటే వారికి ఆడవారంటే ఫోబియా, ఆడవారంటే భయం లేదా అంతర్గత ద్వేషం వల్ల అలా ప్రవర్తిస్తుంటారు. దీనిని గైనోఫోబియా అంటారు. మగవారిని చూస్తే దూరంగా పారిపోయే లక్షణాలుగలవాళ్ళుంటారు. ఈ విధంగా భయం లేదా సిగ్గుతో దూరంగా వుండే లక్షణాన్ని ఆండ్రోఫోబియా అంటారు.
  • సోషల్ ఫోబియా ఉన్నవారు ఇతరులతో  తొందరగా కలవలేరు. ఎక్కువ మంది వచ్చే చోట్ల కు వెళ్లాలంటే ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది చలికి భయపడుతుంటారు. చలిలో బయటకు వెళ్లాలన్నా, స్నానం చేయాలన్నా భయపడిపోతుంటారు. దాన్నిసైక్రో ఫోబియా లేదా క్రియో ఫోబియా అంటారు.
  • ఇక కొంతమంది కొత్తవారిని కలవాలన్నా, మాట్లాడాలన్నా భయపడుతుంటారు.  ఆ భయాన్ని క్సెనో ఫోబియా అంటారు. పక్షులు అంటే భయం ఉంటే ఆర్నితో ఫోబియా అంటారు. మనందరికీ చీకటి అంటే భయమే ఉంటుంది. కానీ కొంతమంది పగలు కూడా చీకటి ప్రదేశాలను చూస్తే భయపడిపోతారు. అలా చీకటిని చూసి భయపడితే నిక్టో ఫోబియా లేదా స్కాటో ఫోబియా అని అర్థం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR