హిడెన్ సిటీ అని పేరు పొందిన రహస్య నగరం ఎక్కడ ఉంది ?

హిమాలయాలు భారతదేశానికి పెట్టనిగోడలా వుండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి. అదే హిమాలయాలలో ఎన్నో రహస్యాలు దాగివున్నాయి.ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నల్లమల అడవులు, ఇంతవరకూ ఏ వ్యక్తీ కూడా పూర్తిగా వాటిలోకి ప్రవేశించలేకపోయారు. వాటిలో ప్రతీపౌర్ణమికి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పెద్దవాళ్ళు చెబుతారు.అటువంటి వాటిలో చాలా ముఖ్యమైనది శంభల నగరం. మన పురాణాలు తెలియచేస్తున్న ప్రకారం హనుమంతుడు కూడా హిమాలయాలలో యతి రూపంలో ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది.

Unknown Facts A bout Hidden Cityఇదంతా ఒక ఎత్తయితే కొన్ని పరిశోధనలు,కొన్ని భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలలో ఉన్న దానిని బట్టి చూస్తే బాహ్యప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయంలో వుంది దాని పేరే శంభల. దీన్నే పాశ్చాత్యులు ‘హిడెన్ సిటీ’ అంటారు. ఎందుకంటే వందలు,వేళ్ళమైళ్ళ విస్తీర్ణంలో వున్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం వుంది. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, చేరుకోవాలన్నా,మనం ఎంతో శ్రమించాలి. మానసికంగా,శారీరకంగా కష్టపడాలి.

Unknown Facts A bout Hidden Cityఅంతో ఇంతో యోగం కూడా వుండాలంట ఆ నగరాన్ని వీక్షించాలి అంటే. ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశమని,ఎవరికిబడితే వారికి కనిపించదని అంటారు.అక్కడ దేవతలు సంచరిస్తారని,ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని చెప్తారు. సంప్రదాయాలకు ఆలవాలమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు జీవితాన్ని ధారపోసి కొన్నివిషయాలు మాత్రమే సేకరించగలిగారు.

Unknown Facts A bout Hidden Cityఅద్భుతాలు అంటే ఇష్టపడే మాజి నేత హిట్లర్ కూడా 1930 లొ శంబాలా గురించి తెలుసుకొవడానికి దాన్ని పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడట. ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని హిట్లర్ కి చెప్పాడట.

Hitlerదాంతో ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్న హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంభాలాకు పయనమయ్యాడని, అక్కడి ఆధ్యాత్మిక వేత్తలతో కలిసి వారి సహయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు అంటారు. వాటిల్లో నిజమెంత అనేది ప్రత్యక్షంగా ఆనాడు చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. అంతే కాక ఆ ప్రదేశాన్ని సందర్శించిన హిమ్లర్ శంబాలా నగరంలో మరెన్నో వింతలు, విశేషాలు మనవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడని అంటారు.

Unknown Facts A bout Hidden Cityబౌద్ధ గ్రంథంలో ఆ ప్రదేశం అణునిత్యం అత్యంత సువాసన వెదజల్లుతూ ఉంటుందని, అక్కడ నివసించేవారు నిరంతరం సుఖసంతోషాలతో జీవిస్తుంటారని, వారికి బాధలన్నవే తెలియవని కూడా లికించబడినది.

Unknown Facts A bout Hidden Cityభారతదేశంలో ‘కర్మ’ సిద్దాంతం ఎక్కువ మంది నమ్మతారు. అందుకే భారతీయులు ఈ నగర పరోశోధన వైపు చూడటం లేదు. పాశ్చాత్యులు మాత్రం శంబాల నగర ప్రదేశాన్ని ‘ది ఫర్బిడెన్‌ ల్యాండ్‌’ అని ‘ది ల్యాండ్‌ ఆఫ్‌ వైట్‌ వాటర్స్‌’ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చైనీయులకు కుడా ఈ శంబాలా నగరం గురించి వారి ఇతిహాసాల ద్వారా తెలుసు.

Unknown Facts A bout Hidden Cityపురాతన గ్రంధాల ప్రకారం లోకంలో పాపం అరాచకత్వం పెరిగిపోయినప్పుడు ఈ నగరంలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అప్పటి నుంచి కొత్త యుగం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఆ కాలం 2424 లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియచేశాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR