వ్యాపారస్తుల దేవుడైన అగ్రసేన్ మహారాజ్ గురించి ఆసక్తికర విషయాలు

అగ్రసేన్‌ మహారాజ్‌ క్షత్రియ వంశంలో జన్మించినప్పటికి తన రాజ్యాభివృద్ది కోసం, ఐదు వేల సంవత్సరాల క్రితం సంపన్నుడిగా జన్మించిన అగ్రసేన్‌ మహారాజ్ తన ప్రజల కోసం వైశ్యుడిగా మారి వ్యాపార అభివృద్దికి పాటుపడ్డారు… వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతేనే ప్రజా సంక్షేమ సాధ్యమవుతుందని భావించి వ్యాపారులను నిరంతరం ప్రోత్సహించేవారు. ‌అందుకే ఆయన వ్యాపారస్తుల దేవుడిగా నిలిచారు.. ఉత్తరభారత దేశంలో ఎక్కువగా ఉండే అగర్వాల్‌ కులంలోని బన్సల్‌, మిట్టల్‌, గోయల్‌, సింఘాల్ వంటి గోత్రాలతో ఉన్న వాళ్ళు అగ్రసేన్‌ మహారాజ్ ని తమ వంశానికి మూలపురుషుడుగా స్మరిస్తూ ఉంటారు. వీరు హిందువులే, నిత్యం పూజించేది లక్ష్మీదేవినే అయినప్పటికీ.. అగ్రసేన్‌ మహారాజ్ ని కుల దైవంగా భావించి కొలుస్తుంటారు.. మరి అగ్రసేన్ మహారాజు వీరికి దేవుడిగా ఎలా మారాడు.. ఆయన గురించిన ఆసక్తికర విషయాలు మనం ఇపుడు తెల్సుకుందామ్..

Agrasen Maharajఅగ్రసేన్‌ మహారాజు సూర్యవంశానికి చెందిన రాకుమారుడు. ప్రతాప్‌నగర్‌ అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు.. ఇతను మహాభారతం నాటివాడనీ, శ్రీకృష్ణునికి సమకాలికుడనీ అంటుంటారు. అగ్రసేనుడు నాగలోకానికి చెందిన మాధవి అనే రాకుమార్తె స్వయంవరానికి హాజరవుతాడు. ఆ స్వయంవరంలో ముల్లోకాలకూ చెందిన రాజకుమారులను కాదని మాధవి, అగ్రసేనుని వరిస్తుంది… అయితే మాధవి అందచందాలకు ముగ్ధుడైన ఇంద్రుడు ఆమెను దక్కించుకోవాలనుకుని భావిస్తాడు.. కానీ ఆమె అగ్రసేనుణ్ణి వరించటంతో.. ఇంద్రుడు ఈర్ష్యతో కక్ష సాధింపుగా, అగ్రసేనుని రాజ్యమైన ప్రతాపనగరంలో తీవ్రకరువు వచ్చేట్లు చేస్తాడు… కరువుతో అల్లల్లాడిపోతున్న తన జనాల్ని రక్షించుకునేందుకు అగ్రసేనుడు, నేరుగా ఆ ఇంద్రుని మీదకే దండయాత్రను ప్రకటిస్తాడు.. ఈ యుద్ధంలో అగ్రసేనుని ధర్మనీతి ముందు ఇంద్రుడు ఓడిపోవటం ఖాయం అని దేవతలందరికీ అర్థమైపోవడంతో నారదుడు రంగంలోకి దిగి ఇరువురి మధ్యా సయోధ్యను కుదిర్చాడు.

Agrasen Maharajఇలా ఇంద్రునిపై ధర్మ విజయాన్ని సాధించి, తన రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు.. అగ్రసేనుడు శివ భక్తుడు కావటంతో.. శివుని అనుగ్రహాన్ని కోరి వారణాసిలో ఘోరతపస్సుని సాగించాడు. అగ్రసేనుని తప్పస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మహాలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోమని సలహాను అందించగా,, అగ్రసేనుడు మహాలక్ష్మికై తపస్సు సాగిస్తాడు.. అపుడు లక్ష్మీదేవి ప్రత్యక్షం అయి.. ప్రజల కోసం వైశ్యవృత్తిని చేపట్టమనీ, వారి కోసం ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించమనీ సూచిస్తుంది.. దాంతో లక్ష్మి దేవి చెప్పినట్లుగానే అగ్రసేనుడు కొత్త రాజ్యాన్ని స్థాపించేందుకు అనువైన ప్రదేశం కోసం వెతకడం మొదలుపెట్టాడు. అలా తన వెతుకులాట సాగుతుండగా ఒకచోట పులిపిల్లలూ, తోడేలు పిల్లలూ కలిసి ఆడుకోవడం కనిపించిందట. వాటిని శుభసూచకంగా భావించి, ఆ ప్రదేశంలోనే అగ్రేయ అనే రాజ్యాన్ని స్థాపించాడు… అదే కాలక్రమంలో అగ్రోహగా మారింది.. ప్రస్తుతం హర్యానాలోని హిసార్‌ జిల్లాలో ఇప్పటికీ ఈ పట్టణం ఆనవాళ్లు ఉన్నాయి..

Agrasen Maharajఅయితే అగ్రసేన్‌ మహారాజు జీవించినంతకాలమూ అగ్రేయ రాజ్యం సుభిక్షంగానే ఉంది. కొత్తవారు కూడా వ్యాపారం చేయాలనీ ఉద్దేశంతో తన రాజ్యంలో స్థిరపడదామనుకుని వచ్చే కొత్తవారికి ప్రతి ఇంటి నుంచి ఇల్లు కట్టుకునేందుకు ఒక ఇటుక, వ్యాపారాన్ని మొదలు పెట్టేందుకు ఒక నాణెము ఇచ్చే సంప్రదాయన్ని సైతం మొదలుపెట్టారట.. అయితే అగ్రసేనుని మరణ అనంతరం అగ్రేయ రాజ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కొద్దిరోజుల తరవాత ఓ అగ్నిప్రమాదంలో రాజ్యం యావత్తూ కాలిపోయింది. అలా ఎప్పుడైతే రాజ్యం బూడిదపాలైందో, అప్పుడు అగ్రసేనుని సంతతి అంతా, దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసబాట పట్టారట. అగ్రసేనునికి మొత్తం 18 మంది కుమారులు కాగా వీరి గురువుల పేరుమీదుగా 18 గోత్రాలను నెలకొల్పారు.

Agrasen Maharaj ప్రస్తుతం మనకి తెల్సిన అగర్వాల్‌, అగ్రహారీ అనే కులాలవారు తాము అగ్రసేన్‌ మహారాజు సంతతి అని పేర్కొంటూ ఉంటారు. ఉత్తరభారతదేశంలో చాలామంది వర్తకులు అగ్రసేన్ మహారాజుని కులదైవంగా కొలుస్తుంటారు..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR