త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామం ఆలయ చరిత్ర ఏంటో తెలుసా?

0
8353

త్రిలింగ క్షేత్రం అని పేరురావడానికి కారణమైన క్షేత్ర త్రయంలో ఈ ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలు ఒకటి తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, రెండవది శ్రీశైలం. ఈ ఆలయం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాసకాశిగా ద్రాక్షారామానికి పూర్వం నుండి గొప్ప ప్రసక్తి ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

trilingaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం మండలంలో ద్రాక్షారామం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరాలయం ఉంది. ఈ దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7 , 8 శతాబ్దాల మధ్య కాలంలో తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది.

ఈ ఆలయంలోని మూలవిరాట్ శ్రీ భీమేశ్వరస్వామి. ఈయన స్వయంభువుగా వెలసిన 14 అడుగుల, శుద్ధ స్పటికాకార శివలింగం. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి శ్రీ మాణిక్యాంబా దేవి. ఈ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో 12 శక్తిపీఠంగా పూజలనందుకొంటుంది. దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసాడు కనుక ద్రాక్షారామం అన్నపేరు వచ్చిందని ప్రతీతి.

trilingaఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి గోరమైన తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షం కాగా, ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా అప్పుడు శివుడు ఆత్మలింగాన్ని వరంగా ఇస్తాడు. అప్పుడు రాక్షసుడు అయినా తారకాసురుడు ఆ శివలింగ మహిమ వలన దేవతలను, ఋషులను అందరిని అనేక ఇబ్బందులకు గురి చేస్తుండగా, వారందరు శ్రీ మహావిష్ణువు ని ప్రార్ధించారు.

trilingaఅప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో ఆ తారకాసురుని కంఠంలో ఆత్మలింగం తొలగితే కానీ ఆ రాక్షసుడి శక్తి నశించదని, ఈశ్వరుని అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలన అతడు మరణం లేకుండా వరం పొందాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణ చేత పార్వతి కళ్యాణం, అనంతరం కుమార సంభవం జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గుణములకు నాయకత్వం వహించి తారకాసురునితో యుద్ధం చేయగా, కుమారస్వామి ఎక్కుపెట్టిన బాణానికి ఆ ఆత్మలింగానికి తగిలి అది ఐదు ముక్కలై భూమి మీద ఐదు చోట్ల పడ్డాయి. అవే పంచారామక్షేత్రాలుగా అవతరించాయని స్థలం పురాణం తెలియచేస్తుంది.

trilingaఇక ఆలయ విషయానికి వస్తే, ఇక్కడి స్వామివారి గర్భాలయం రెండంతస్థులుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి స్వామివారి మూలవిరాట్ విగ్రహం 11 అడుగుల ఎత్తు ఉన్నందువల్ల ఆలయ కింది అంతస్థులో పానవట్టమూ, పైన అంతస్థులో లింగం యొక్క శిరోభాగం ఉంటుంది. పూజలు అభిషేకాలు అన్ని పైన అంతస్థులోనే జరుగుతాయి.

trilingaఈ ఆలయంలోని శివలింగం సగభాగం నల్లగా, సగభాగం తెల్లగా ఉంటుంది. శివుడు అర్ధనారీశ్వరుడు అనటానికి ఇది ఒక నిదర్శనం అంటారు. ఇంకా మాఘశుద్ధ పౌర్ణమినాడు శివునికి, లక్ష్మీనారాయణులకు ఒకే వేదికమీద ఇద్దరికీ ఒకేసారి కళ్యాణం జరగడం ఈ ఆలయంలోని ప్రత్యేకత చెప్పవచ్చును. ఈ ఆలయ ఆవరణలోనే సప్తగోదావరి అనే పుష్కరణి ఉంది.

trilingaఇలా ఎంతో ప్రసిద్ధమైన ఈ ప్రాచీన శైవక్షేత్రంలో శివరాత్రికి గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ సమయంలో ఈ ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు.

trilinga