శివుడి భార్య అయిన గంగ శాంతనుని ఎందుకు పెళ్లి చూసుకుంది?

పవిత్రతకు మారు పేరు గంగ. మహాదేవుడి నెత్తిన ఉండే గంగా దేవి పరమ శివుడి భార్యగానే అందరికి తెలుసు. కానీ గంగా దేవి భూమి మీదకు వచ్చి ఎందుకు జీవించాల్సి వచ్చింది ? శాంతనుడికి భార్య ఎలా అయింది అనేది చాలా మందికి తెలియదు. దాని వెనుక ఓ కథ ఉంది. ఒకానొక నాడు బ్రహ్మ దేవుడు ఒక సభను ఏర్పాటు చేస్తాడు .ఆ సభకు ఋషులు, రాజులూ, దేవతలను ఆహ్వానిస్తాడు. అదే సభలో విధాత 14వ తరం వారసుడు మహాభిషేకుడు కూడా ఉంటాడు. అప్పుడు హిమవంతుని పెద్ద కూతురు గంగా దేవి సభకు వస్తుంది. ఆమె అపురూప సౌందర్య రాశి. ఆమె అందానికి ముగ్ధుడైన మహాభిషేకుడు ఆమెను తీక్షణంగా చూస్తూ ఉండిపోతాడు. అయితే ఆ సమయంలో గాలి బాగా వీచడం వాళ్ళ గంగా దేవి పవిట కొంగు ఆమెకు తెలియకుండానే జారిపోతుంది. కాగా సభా మర్యాద ప్రకారం అందరూ తలలు వంచుకుంటారు. కానీ మహాభిషేకుడు మాత్రం ఆమెను అలాగే చూస్తూ ఉంటాడు.

Shantanuఅది గమనించిన గంగా దేవి కూడా మహాభిషేకుడిని చూస్తుంది. దాంతో కోపం వచ్చిన బ్రహ్మ దేవుడు సమయం కానీ సమయంలో సభా మధ్యలో కామించినందుకు మధ్య లోకం అంటే భూలోకంలో కొంతకాలం జీవించమని మహాభిషేకుడిని శపిస్తాడు. అలాగే గంగా దేవిని కూడా కొంత కాలం అతని భార్యగా బ్రతకమని శపిస్తాడు. మహాభిషేకుడు భూలోకంలో పుత్ర సంతానం కోసం పరితపిస్తున్న బ్రతిబుని కుమారుడు శాంతనుడిగా జన్మిస్తాడు. గంగా దేవికి పూర్వ జన్మ గురించి తెలుసు కానీ శాంతనుడికి గుర్తుండదు. ఇలా ఉండగా ఒకరోజు శాంతనుడు అడవికి వేటకు వెళ్లి అలసిపోయి నీటి కోసం వెతుకుతూ ఉంటాడు. అంతలో గంగా దేవి అందమైన అమ్మాయి రూపంలో నీటిని తీసుకు వచ్చి ఇస్తుంది. ఆమెను చూసి ప్రేమించిన శాంతనుడు ఆమెను వివాహం చేసుకుంటా అని అడుగుతాడు.

Shantanuఅయితే ఒక షరతు మీద గంగా దేవి ఈ వివాహానికి ఒప్పుకుంటుంది. అది ఏమిటంటే… “నేను ఏమి చేసిన అడగకూడదు. అలా ప్రశ్నిస్తే నేను నిన్ను ఒదిలి వెళ్ళిపోతా” అని చెప్తుంది . శాంతనుడు షరతు కి ఒప్పుకొని వివాహం చేసుకుంటాడు .పెళ్లి తర్వాత వశిష్ఠుని శాపానికి గురైన అస్టవాసులు పిల్లలుగా పుడతారు. వారిని గంగా ప్రవాహంలో పడేసి శాపవిమోచనం చేస్తానని గంగా దేవి మాట ఇస్తుంది. పుట్టిన ఏడుగురు పిల్లలను గంగా దేవి గంగా ప్రవాహంలో ఒదిలేస్తుంది. ఇది చూసి శాంతనుడు చాలా బాధపడతాడు.

Beshmuduఎనిమిదవ సంతానంని కూడా గంగా ప్రవాహంలో వేయబోతుంటే శాంతనుడు ఆపడానికి ప్రయత్నిస్తాడు. నన్ను ప్రశ్నిస్తే ఒదిలి వెళ్ళిపోతా అని తాను చెప్పిన ప్రకారం గంగా దేవి తిరిగి దేవలోకానికి వెళ్తుంది. అయితే ఈ ఎనిమిదవ సంతానాన్ని మాత్రం నీ కోరిక మేరకు ప్రవాహంలో వేయను అని చెప్పి, పెంచి కొన్ని రోజుల తర్వాత నీ దగ్గరికి పంపిస్తా అని చెప్పి బాలున్ని తీసుకొని వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత తిరిగి శాంతనుడి దగ్గరికి పంపిస్తుంది. ఆ బాలుడే భీష్ముడు!

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR