దేవుడికి మాంసాన్ని వండి నైవేద్యంగా పెట్టె ఆలయం

సాధారణంగా గుడికి వెళ్లాలంటేనే మాంసం తినరు. అలాంటిది దేవుడికే మాంసాన్ని నైవేద్యంగా పెడితే…? వాస్తవానికి ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయాన్ని బట్టి కొన్ని చోట్ల పరమాన్నం, చక్కరపొంగలి, దద్దోజనం కూడా నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. భద్రాద్రి లో ఇప్పపువ్వు ని నైవేద్యంగా సంమర్పిస్తారు.

గుంప సోమేశ్వర ఆలయంఒకరకంగా చెప్పాలంటే, ఆలయ ప్రాంతాల్లోని ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగానే అక్కడి దేవుడికి నైవేద్యాలను నివేదిస్తారు. కొన్ని ఆలయాల బయట జంతుబలి జరుగుతుండడం అందరికి తెలుసు. కానీ, ఇలా ఆలయం లోపల మాంసాహారం నైవేద్యంగా పెట్టడం ఎప్పుడూ వినలేదు. కానీ ఈ ఆలయంలో దేవుడికి మాంసాన్ని వండి పెడతారట. అది ఎక్కడో తెలుసుకుందామా.

గుంప సోమేశ్వర ఆలయంఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొమరాడలోని గుంప సోమేశ్వర ఆలయంలో పరమ శివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. పంచలింగాల్లో ఒకటైన ఈ గుంప సోమేశ్వర ఆలయం పవిత్ర నాగావళి నదీతీరంలో వెలిసింది. జంఝూవతి, నాగవళి నదుల విత్ర సంగమం ఈ ఆలయ సమీపంలో దర్శించవచ్చు. ప్రకృతి రమణీయతల మధ్య ఉన్న ఈ దేవాలయం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

గుంప సోమేశ్వర ఆలయంమహా శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు అంగ రంగ వైభవంగా.. కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూరనే నైవేద్యంగా సమర్పిస్తారు. రుచిగా వండిన చేపలకూర శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలన్నీనెరవేరతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని, తద్వారా ఆ భోళా శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్నామని భక్తులు పేర్కొంటున్నారు. వందల ఏళ్ల నుంచి స్థానికులు పవిత్రమైన రోజుల్లోనే కాకుండా తమ ఇంట్లో శుభకార్యాలు జరిగే సమయంలో కూడా ఇటువంటి మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు.

గుంప సోమేశ్వర ఆలయంఈ గుంప సోమేశ్వర ఆలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. బలరాముడు ఇక్కడి కరువు పరిస్థితులను రక్షించడానికి గంగను తన ఆయుదమైన నాగలి సహాయంతో రప్పించాడు కాబట్టే దీనికి నాగావళి అని పేరు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR