హనుమాన్ చాలీసా గురించి ఎవరికి తెలియని నిజాలు

జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ తిహుం లోక ఉజాగర..
రామదూత అతులితబలధామ
అంజనీ పుత్ర పవనసుతనామా..

హనుమాన్ చాలీసాలోని పరమ పవిత్రమైన ఈ శ్లోకాలు ఒక్కసారి పఠిస్తే చాలు దుష్టశక్తుల ప్రభావం తొలగి.. కొండంత ధైర్యం ఆ వీరంజనేయుడి నుంచి పొందుతామని ఎంతో మంది పండితుల అభిప్రాయం. లక్షల మంది భక్తులు ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదువుతుంటారు. కొంతమంది రోజుకు ఏడు సార్లు పఠిస్తూ తమ భక్తిని స్వామికి ఈ రూపంలో తెలియస్తున్నారు. మరి ఈ పవిత్రమైన హనుమాన్ చాలీసా గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం

Unknown facts about Hanuman Chalisaసంస్కృతంలో ఉన్న ఈ గ్రంథంలో మొత్తం 40 శ్లోకాలు ఉన్నాయి. ఈ పద్యాల సంపుటిని హనుమాన్ చాలీసాగా పిలుస్తారు. పావనమూర్తి అయిన ఆ శ్రీరాముడి పరమ భక్తుడు తులసీదాసు ఈ పవిత్ర గ్రంథాన్ని రాశారు. మొత్తం 40 మంది దేవతలు పేరు మీదుగా చాలీసా రచించారు. హనుమాన్ చాలీసాలో ఉన్న శ్లోకాలు ఆ వీరంజనేయుడి గొప్పతనం, శ్రీరాముడి పట్ల ఆయనకున్న భక్తిని స్పష్టంగా శ్లోకాల రూపంలో విశీదికరించారు.

Unknown facts about Hanuman Chalisaవాయుపుత్రుడిని స్తుతిస్తూ రచించిన ఈ శ్లోకాలు కేవలం భక్తికి సంబంధించినవే కాదు.. ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో సత్యాలను తెలియస్తున్నాయి. నిత్యం హనుమాన్ చాలీసాను చదివితే పీడ, చెడు ప్రభావాలు తొలిగి సమస్యలను ఎదిరించే శక్తి, ప్రశాంతత కలుగుతుందట. అంతేకాకుండా విజ్ఞానం పెరుగుతుందట.

Valmikiమరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పరమ పావనమైన రామాయణం రచించిన వాల్మీకి తర్వాతి జన్మలో తులసీదాస్ గా అవతరించారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అందుకే పునర్జన్మలో ఆయనే హనుమాన్ చాలీసా రచించారని వారి నమ్మకం. అయితే వీరిద్దరి పుట్టుకల మధ్య ఎన్నో శతాబ్దాల వ్యత్యాసముంది. త్రేతాయుగంలో వాల్మీకి జీవించగా.. కలియుగంలో (15వ శతాబ్దం) తులసీదాస్ జీవించారు.

Tulasi Dasతులసీదాస్ తన జీవితంలో చాలా ఏళ్లపాటు వారణాసిలో జీవించారు. అక్కడే ఆయన శ్రీరాముని బంటు హునుమంతుడిని దర్శించుకున్నట్లు భక్తుల నమ్మకం. అందుకు గుర్తుగానే వారణాసిలో సంకటమోచన దేవాలయాన్ని తులసీదాస్ నిర్మించినట్లు నమ్ముతున్నారు. ఇప్పుడున్న ఆ ఆలయ ప్రాంగణంలోనే తులసీదాసు హనుమంతుడిని ప్రత్యక్షంగా దర్శించుకున్నారట.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR