అగ్నితో స్నానం చేసే ఇడాన మాత ఆలయ రహస్యాలు

ఈ ప్రపంచంలో సైన్స్ కి అంతుపట్టని విషయాలు, వింతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో పరిశోధకులను ఆశ్చర్య పరిచే వింతలు అడుగడుగునా ఉన్నాయి. మన దేవాలయాల్లో ఒక్కో ఆలయానిది ఒక్కో విశిష్టత. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన కాలంలో కూడా బాబాలకు, సాధువులకు ఇంత క్రేజ్ ఉండడానికి కూడా అదే కారణం. మూఢ నమ్మకం అని కూడా అనలేము. ఎందుకంటే కళ్ళముందు కణికట్టులా మాయ కనిపిస్తుంటుంది కాబట్టి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా… అక్కడికే వస్తున్నాం!

Idana Mata Templeరాజస్థాన్ లో అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన ఓ అమ్మవారి దేవాలయం ఉంది. ఇడాన మాతాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఉన్న దేవత అగ్నిస్నానమాచరిస్తుంది. అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది. ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురాస్రాకరంలో ఉంది. ఇడాన ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది.

Idana Mata Templeఇక్కడ ఉన్న ఇడాన మాత నెలకు రెండు మూడు సార్లు అగ్నితో స్నానం ఆచరిస్తుంది. అయితే అక్కడ మంట దానంతట అదే ఎలా మండుతుంది అనేది ఎవరికి అంతుచిక్కని మిస్టరీ. ఈ మంటలు ఉద్భవించినపుడు దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వస్తుందట. కానీ ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ తప్ప మిగతా ఏమి నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు స్వయంగా జ్వాలాదేవిగా మారి అగ్ని స్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు.

Idana Mata Templeఈ మంటలను ప్రత్యంగా చూసినవారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా.. అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు.

Idana Mata Templeముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృత పరచలేదు. పైన రూఫ్ కూడా లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురాస్రాకరంలో ఉంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR