బ్రహ్మ తలనే ఖండించిన కాలభైరవుని శక్తుల గురించి తెలుసా!

కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర తంత్ర మూర్తిగా అందరికి తెల్సు.. మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి కాలభైరవుడు.. అన్నీ శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. చెప్పాలంటే భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. కాలభైరవుడిని పూజించడం ద్వారా దారిద్రం తొలగిపోతుంది. రుణబాధలు తీరిపోతాయి. న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని సైతం అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి ఉందంటారు ఆధ్యాత్మిక పండితులు. మరి ఇంతటి మహిమ కల కాలభైరవుడు ఆవిర్భావం ఎలా జరిగింది.. కాలభైరవుని శక్తుల గురించి మనం ఇపుడు తెల్సుకుందాం..

Kala Bhairavaప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కన్పించే విగ్రహం భైరవుడు. భయాన్ని కలిగించేలా వుంటుంది ఆయన రూపం. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా కనిపిస్తుంటాడు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు .. క్రోధ భైరవుడు .. ఉన్మత్త భైరవుడు .. కపాల భైరవుడు .. భీషణ భైరవుడు .. సంహార భైరవుడు .. అనే ఎనిమిది నామాలతో … వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ వుంటాడు.

భైరవ అనే పేరే ఆయనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తున్నట్టుగా వుంటుంది. ఎదుట నిలిచినది ఎలాంటి శక్తి అయినా ఆయన ధాటిని తట్టుకుని నిలబడటం కష్టమనిపిస్తుంది. ఆయా క్షేత్రాలకి భైరవుడు పాలకుడని తెలిసినప్పుడు … శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన రూపాన్ని చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగకపోదు. వీరభద్రుడిలా భైరవుడు కూడా శివుడు నుంచి ఆవిర్భవించినవాడే.

kala bhirabaతనని అవమానపరచడమే కాకుండా, తనకి సతీదేవిని దూరం చేసిన దక్షుడిపై శివుడు ఉగ్రుడవుతాడు. వీరభద్రుడిని సృష్టించి దక్షుడి శిరస్సును ఖండింపజేస్తాడు. అలాగే తన విషయంలో అవమానకరంగా వ్యవహరించిన బ్రహ్మదేవుడిపై కూడా శివుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలోనే ‘భైరవుడు’ ని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు.

మహా పరాక్రమవంతుడైన భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల అయిదు శిరస్సుల్లో, ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు. ఆ తరువాత బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి తాను ఏం చేయాలో చెప్పమని భైరవుడు అడుగుతాడు. ఖండించినటు వంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఉండమనీ, ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో, అక్కడితో ఆయన పాపం ప్రక్షాళన అవుతుందని శివుడు చెబుతాడు.

Kala Bhiravaభైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కిందపడిన ప్రదేశమే నేడు ‘బ్రహ్మ కపాలం’ గా పిలవబడుతోంది. ఆ తరువాత శివాజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి చేరుకున్న భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు. ఆ తరువాత అనేక శైవక్షేత్రాల్లో ఆయన మూర్తిని క్షేత్రపాలక శిలగా ప్రతిష్ఠించారు. ఆయా క్షేత్రాల్లో భైరవుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడుతూ వుంటాడు. ఈ స్వామిని ఆరాధించడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందనీ, పాడిపంటలు వృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు..

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR