కుమారస్వామి ద్విభుజాలతో ఉన్నత స్థానంలో శివుడు కొంచెం దిగువ స్థానంలో నిల్చుండి దర్శనమిచ్చే అద్భుత ఆలయం

0
7003

సుబ్రహ్మణ్యస్వామి వారికీ దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అయితే శివునికి ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి ప్రణవ మంత్రం ఓం తత్వాన్ని వెల్లడించిన కారణంగా కార్తికేయుడు స్వామినాథుడైనాడని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయంలోని విశేషాలు, స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 Swaminathaswamy temple, Swamimalaiతమిళనాడు రాష్ట్రము, తంజావూరు జిల్లా, కుంభకోణానికి సుమారు 6 కీ.మీ. దూరంలో స్వామిమలై అనే పుణ్యక్షేత్రం ఉంది. కుంభకోణం వద్ద కావేరి నదికీ రెండవ తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో బాల మురుగన్ (కుమారస్వామి) ప్రణవ మంత్రాన్ని జపించాడని తెలుస్తుంది. ఇచట ఈ స్వామివారిని స్వామినాథుడు అని భక్తులు పిలుస్తారు. ఇంకా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామిని గురునాధుడు అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇచట శివుడికి సుబ్రహ్మణ్యస్వామి ప్రణవ రహస్యము ఉపదేశించాడు.

subramanya swamyఇక్కడ మూలవిరాట్టు స్వామి చాలా అందంగా కనిహస్తుడై, ద్విభుజాలతో దర్శనం ఇస్తాడు. కుమారస్వామి ఉన్నత స్థానంలో ఉండగా శివుడు కొంచెం దిగువ స్థానంలో నిల్చుండి భక్తి, వినయ విధేయతలతో ఉపదేశ రహస్యం స్వీకరిస్తున్నాడు. స్వామినాథుడు తన తండ్రి భుజాల మీద కూర్చుని అయన చెవిలో ప్రణవ రహస్యం బోధించాడు. కనుక ఈ ఆలయం ఈశ్వర సన్నిధానంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ నుండి 60 మెట్లు ఎక్కినా తరువాత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం మొత్తాన్ని స్వామిమలై అంటారు.

subramanya swamyఒకపుడు పరమేశ్వరుని దర్శించటానికి గాను కైలాసం వచ్చిన బ్రహ్మ దేవుడిని ప్రణవమంత్రాన్ని చెప్పమని కుమారస్వామి అడిగాడట. అర్ధం చెప్పేందుకు బ్రహ్మదేవుడ్ని బందించగా, తన తండ్రి పరమేశ్వరుని కోరిక మేరకు, బ్రహ్మను బంధ విముక్తుడిని చేసి, తాను ఒక ముని రూపం ధరించి, స్వయంగా ప్రణవమంత్రానికి అర్ధం ఉపదేశించాడట. ఆలా ముని రూపంలో ఉన్న అంశకు సంబంధించిన ఆలయమే ఈ స్వామిమలై ఆలయం. స్వామిమలై అంటే తమిళంలో స్వామికొండ అని అర్ధం.

subramanya swamyస్వామినాథస్వామి ఆలయం మూడు గోపురాలను, మూడు ప్రాకారాలు కలిగిఉన్నది. ఇక్కడి ఆలయ ప్రాకారాలు విచిత్రంగా ఉన్నాయి. మొదటి ప్రాకారం గుట్ట అడుగుభాగంలో ఉన్నది. రెండవ ప్రాకారం గుట్ట మధ్యభాగంలో ఉన్నది. మూడవ ప్రాకారం కొండపై ఆలయం చుట్టూ నెలకొని ఉన్నది. ఇక్కడి ఆలయం బావిని వజ్రతీర్థం అని పిలుస్తారు.

6 Swaminathaswamy temple, Swamimalai