రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి ఈ ఆలయంలో జరిగే అధ్బుతం ఏంటి ?

మన దేశంలోని కొన్ని దేవాలయాలలో ఉండే కొన్ని అద్భుతాలు ఇప్పటికి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. దానివెనుక దైవ లీలా ఉందని భక్తులు భావిస్తారు. అలాంటి అధ్భూత ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెప్పవచ్చు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి జరిగే ఆ అధ్బుతం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Iswara Mahadev Temple

మధ్యప్రదేశ్ రాష్ట్రం, మోరేనా జిల్లా లో ఈశ్వర మహాదేవ్ అనే శివాలయం ఉంది. ప్రకృతి అందాల నడమ దట్టమైన అరణ్య ప్రాంతంలో ఎత్తైన కొండపైన ఈ ఆలయం ఉంది. అయితే ఉదయం ఇక్కడ గుడి తలుపులు తెరవగానే ఆలయ పూజారికి ఒక అధ్భూతం కనిపిస్తుంది. అయితే గర్భగుడి తలుపులు తెరవగానే అత్యంత శోభాయమానంతో అర్చించి, పూజించ బడి మీద బిల్వదళ ధారుడై పువ్వులతో అభిషేకించబడిన లింగస్వరూపం దర్శనం ఇస్తుంది.

Iswara Mahadev Temple

అయితే దట్టమైన అరణ్యంలో వెలసిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత అనేది ఉంది. అయితే బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటలకి ఒక సిద్ద యోగి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటాడని ఇక్కడివారు చెబుతారు. కానీ అయన ఎవరు, ఎటు నుండి వస్తాడు అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా కనిపెట్టలేదు.

Iswara Mahadev Temple

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, సంవత్సరంలో 365 రోజులు అంటే ప్రతి రోజు కూడా ఇక్కడ సహజ సిద్ధంగా శివలింగం పైన నీరు పడుతూనే ఉంటుంది. అయితే పూజారి ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకి వచ్చి గర్భగుడి తెరిచి చూసేసరికి ఎవరో అంతకముందే ఎవరో శివుడికి పూజ చేశారనేందుకు సాక్ష్యంగా శివలింగం బిల్వదళాలు, పువ్వులు అందంగా అలంకరించి ఉంటాయి. అయితే ఇలా ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తానికి నేటికీ శివలింగాన్ని ఎవరు పూజిస్తున్నారనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.

Iswara Mahadev Temple

ఇక ఇలా ఎవరు శివలింగాన్ని పూజహిస్తున్నారనే విషయం తెలుసుకోవడానికి రాజుల కాలం నుండి కూడా ఎందరో విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పూజచేసేది ఎవరు అనేది తెలుసుకోలేకపోయారు. అయితే ఒకప్పటి రాజైన పంచల్ సింగ్ కొందరు గూఢచారులను అక్కడ కాపలాగా పెట్టాడు, కానీ ఉదయం వచ్చి చూసేసరికి వారు సృహ తప్పి ఉన్నారు. ఇలా ఎందరో ఆ ఆలయం వద్ద రాత్రి అంత కాపలా కాసినప్పటికీ ఎవరు కూడా శివలింగాన్ని పూజించేది ఎవరో తెలుసుకోలేకపోయారు.

Iswara Mahadev Temple

అయితే అక్కడి స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం, రావణుడి తమ్ముడు అయినా విభీషణుడు ఇక్కడ కొండపైన శివలింగాన్ని ప్రతిష్టించి రోజు పూజలు చేసేవాడట, అప్పటినుండి శివలింగం శిరస్సు పైన నీటి బిందువులు పడటం మొదలయ్యాయి అని, పురాణాల ప్రకారం సప్త చిరంజీవుల్లో విభీషణుడు కూడా ఒకరు, ఇంకా ఈ శివలింగాన్ని ఆయనే ప్రతిష్టించాడు కనుక నేటికీ ఆయనే ఇక్కడ శివుడికి పూజార్చన చేస్తున్నాడని ఇక్కడ స్థానికుల నమ్మకం.

Iswara Mahadev Temple

ఇంకొక కథనం ప్రకారం, రాందాస్ జి మహారాజ్ అనే సన్యాసి రోజు ఉదయం ఇక్కడ తపస్సు చేసేవాడట, అంతేకాకుండా శివలింగానికి రోజు ఉదయం మాత్రమే శివపూజ చేసేవాడట, అయితే అయన శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ అదృశ్య రూపంలో క్రమంతప్పకుండా ఇక్కడ పూజలు చేస్తున్నాడని చెబుతుంటారు.

Iswara Mahadev Temple

ఈ ఆలయం లో మరొక విశేషం ఏంటంటే, సాధారణంగా బిల్వదళాలు మూడు సముదాయాలుగా ఉంటాయి, కానీ ఇక్కడి బిల్వదళాలు ఐదు నుండి ఏడూ ఆకుల సముదాయం ఉంటుంది. ఇంకా ఇక్కడి శివలింగం దగ్గర ఇరవై ఒక్క ఆకుల సముదాయం చూశామని భక్తులు చెబుతుంటారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ అత్యంత మహిమ గల శివలింగాన్ని దర్శించుకోవడం కోసం శివరాత్రి సమయంలో ఇంకా ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR