పాండవులు కౌరవులు ఆడిన మాయ జూదం వెనుక కారణం

బ్రహ్మ మానసపుత్రుడు అత్రి. అతని కొడుకు చంద్రుడు. అతని వంశంలో భరతుడు పుట్టాడు. భరతుని వంశములో శంతనుడనునికి భీష్ముడు పుట్టాడు. అతడు పెళ్లి చేసుకోలేదు. శంతముని భార్య సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనువారు కూడా పుట్టారు. చిత్రాంగదుడు ఒక గంధర్వునితో పోరాడి మరణించాడు. భీష్ముడు విచిత్ర వీర్యునికి కాశిరాజు కూతుళ్లైన అంబిక, అంబాలిక అనువారినిచ్చి పెండ్లి చేసాడు.

Unknown Facts About Pandavas Kauravasవిచిత్రవీర్యుడు క్షయరోగముతో మరణించగా, సత్యవతి ఆదేశము మీద అంబిక వ్యాసుని వలన ధృతరాష్ట్రుని, అంబాలిక పాండురాజుకి జన్మనిస్తుంది. ధృతరాష్ట్రునికి గాంధారికి దుర్యోధనాదులు వందమంతి కొడుకులు పుట్టారు. పాండురాజుకు కుంతి, మాద్రి అని ఇద్దరు భార్యలు. అతడు శాపగ్రస్తుడు కాగా, అతని అనుమతితో కుంతి యమధర్మరాజు ప్రసాదమున ధర్మరాజును, వాయుప్రసాదమున భీముని, ఇంద్రపసాదమున అర్జునుని కంటుంది. మాద్రి అశ్వినుల అనుగ్రహన నకుల సహదేవులను కంటుంది. పాండురాజు మాద్రిని కలియబోయి మరణించాడు.

Unknown Facts About Pandavas Kauravasకర్ణుడు, కుంతికి పెళ్లికాక ముందే సూర్యునివలన పుట్టినవాడు. అతడు దుర్యోధనుడు మిత్రులు అయ్యారు. కురుపాండవులు కృపద్రోణుల వద్ద సర్వశస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నారు. దైవయోగము వలన కురుపాండవుల మధ్య వైరము వచ్చింది. దుర్యోధనుడు లక్కయింటిలో నిప్పు బెట్టి పాండవులను దహించాలని చూసాడు. పాండవులు తప్పించుకొని ఏకచక్రపురానికి చేరుకున్నారు. మునివేషుములతో ఉండి బకాసురుని చంపి, పాంచాలదేశముకు వీరు వెళ్లారు. అక్కడ అర్జునుడు, మత్స్యయంత్రాన్ని కొట్టాడు. ద్రౌపది పాండవులయిదుగురికి భార్య అయ్యింది. శ్రీకృష్ణుడు అర్జునుడిచే ఖాండవ వనమును దహింపజేశాడు.

Unknown Facts About Pandavas Kauravasఅప్పుడే అగ్నివలన అర్జునునకు గాండీవమను విల్లు, రథము లభించింది. ధర్మరాజు సోదరుల సహాయంతో నలుదిక్కల రాజులను గెలిచి రాజసూయము మహావైభవంగా చేశాడు. అది చూసిన దుర్యోధనునకు కన్నుకుట్టింది. అతడు శకుని, కర్ణ, దుశ్శాసనుల ప్రోత్సాహముతో ధర్మరాజును పిలిచి, శకునితో మాయజూదం ఆడించి రాజ్యాన్ని అపహరించి పాండవులను పన్నెండేళ్లు వనవాసమును, ఒక ఏడు అజ్ఞతవాసము చేయడానికి అడువులకు పంపించాడు. ధర్మరాజు సోదరులతో, ద్రౌపదితోను ద్వాదశవర్రషములు అరణ్యవాసము చేసి, పదమూడవ యేట అజ్ఞాతవాసము చేయుటకు విరాటనగరమునకు వెళ్లారు. ధర్మరాజు తాను కంకుభట్టయ్యాడు భీముడు వంటలవాడయ్యాడు.

Unknown Facts About Pandavas Kauravasఅర్జునుడు బృహన్నలమయ్యెను. నకుల సహదేవులు అశ్వగోపాలకులయ్యారు. ద్రౌపది సైరంధ్రిగా విరటుని భార్య సుధేష్ట దగ్గర చేరింది. ఇంద్రప్రస్థమున వున్నప్పుడే అర్జునునికి కృష్ణుని చెల్లెలైన సుభద్రతో పెళ్లి అవుతుంది. వారికి అభిమన్యుడు అనే కుమారుడు పుడతాడు. అజ్ఞాతవాసానంతరము పాండవులను గుర్తించిన విరాటుడు తన కుమార్తె ఉత్తరను అభిమన్యునకిచ్చి వివాహము చేశాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR