ప్రత్యంగిరామాత ఎలా ఉద్భవించిందో తెలుసా ?

ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. అయితే హిరణ్యకశిపుని సంహరించిన తరువాత కూడా ఆయన క్రోధం తగ్గలేదు. సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చినా ఆయన కోపాన్ని తగ్గించలేకపోయాడు. అప్పుడు ఉద్భవించిందే ప్రత్యంగిరా మాత. మహా భయంకరమైన ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం. ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు ఈ ఋషిపుంగవులిద్ధరు. అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ భీజాక్షరాలకు ఇలా ప్రత్య +అంగీర= ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .ఈ ప్రత్యంగిరా మహామంత్రం అధర్వణ వేదంలోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తములో అంతర్భాగంగా వుంది.

Unknown Facts About Prathyangira Deviప్రత్యంగిరామాత ఉద్భవించిన విధానం :

కృతయుగం లో హిరణ్యకశ్యుపుని సంహరించటానికి శ్రీహరి నరసింహా అవతారంలో రాతి స్ఠంభంలోనుండి ఉద్భవించి అసురసంద్యవేళ గడపపై తన పదునైన గోళ్ళతో కడుపు చీల్చి సంహరించాడు. రాక్షసాధమున్ని చంపినా నరసింహ మూర్తి కోపం చల్లారలేదు నరసింహుని క్రోధానికి సర్వ జగత్తు నాశనమౌతుందని భయపడ్డ దేవతలు నరసింహుని కోపాన్ని చల్లార్చటానికి పరమేశ్వరున్ని ప్రార్ధించారు.

Unknown Facts About Prathyangira Deviఅప్పుడు పరమేశ్వరుడు వీరభధ్రావతారం లో నరసింహుని ముందుకు వచ్చి జ్ఞానభోధతో నరసింహుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నిస్తాడు. కానీ నరసింహ మూర్తి మరింత కోపంతో అష్టముఖగండభేరుండమూర్తి అవతారంతో వీరభద్రుని పైకి వురుకుతాడు. అంతట వీరభద్రుడు శరభా అవతారం దాలుస్తాడు. శరభుని రెండు రెక్కలలో ఒక రెక్కలో శూలిని, మరో రెక్కలో మహాప్రత్యంగిరా శక్తులు దాగి వుంటాయి. అష్టముఖగండభేరుండమూర్తి తనవాడి అయిన ముక్కుతో శరభేశ్వరున్ని ముక్కలు చేయ్యటానికి ప్రయత్నిస్తాడు. శరభేశ్వరుని శూలిని శక్తి దాగివున్న రెక్క అష్టముఖగండబేరుండమూర్తి ముక్కుకి చిక్కుతుంది రెండో రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించింది.

Unknown Facts About Prathyangira Deviనేలనుండి నింగిని తాకేటట్లుండే మహాభారీకాయంతో కూడిన స్త్రీదేహం ఆ స్త్రీ దేహం కారుఛీకటితోకూడిన నల్లనివర్ణం మగసింహపు వేయ్య తలలతో ఓకవైపు ఏర్రన్ని నేత్రాలు మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పైరెండు చేతులతో ఉద్భవిస్తుంది. ప్రత్యంగిరామాత మొదటి నాలుగు చేతులలో ఒకచేతిలో త్రిశూలం మరోచేతిలో సర్పం అలంకారంగా చుట్టుకున్న డమురుకము, మరో చేతిలో ఈటె వంటి కత్తి మరోచేతిలో అసురుని శిరస్సు మిగితా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో మెడలో కపాల మాలతో అత్యంత పొడువైన కేశాలతో కేశాల చివర శక్తి తోకూడిన తంతువులు నాల్గు సింహల స్వర్ణ రధంపైఈ నాల్గు సిం హలను నాల్గు వేదాలు గా కొందరు మరికొందరు నాల్గు పురుషార్ధాలుగానూ ఇంకొందరు నాల్గు ధర్మాలగానూ విశ్లేషిస్తారు సాధకులు} ఉద్బవించింది.

Unknown Facts About Prathyangira Deviఈమె ఉద్బవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశ్ లోని ఒక రహస్య ప్రదేశంలో వుంది ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో వుంటాయి ఈ సరస్సుకు ఎల్లప్పుడు సింహాల గుంపు కాపలాగావుంటుంది అని ఎంతో మంది సిద్ధ సాదకులు నిక్కచ్చగా చెపుతున్నారు. మహామాత మహా ప్రత్యంగిర స్వరూపాన్ని చూసి నరసింహ మూర్తి అహంకారాన్ని వీడి తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి ఉగ్ర నరసింహ అవతారాన్ని చాలించి యోగ నరసింహ మూర్తిగా కొలువు తీరుతాడు. అందుకే మహా ప్రత్యంగిరను కాళీ సహస్రనామస్తోత్రంలో నృసింహిక అంటూ వర్ణించారు

Unknown Facts About Prathyangira Deviత్రేతాయుగములో రాక్షసరాజు రావణాసురుని తనయుడు ఇంద్రజిత్తు మహాగొప్ప మహాప్రత్యంగిరా సాధకుడు. ఆయన ఆ రోజుల్లో నికుంబలాదేవి పేరుతో ప్రత్యంగిరా ఉపాసనచేసాడు.అయితే ఈ ఉపాసన సిద్ధిస్తే ఇంద్రజిత్త్ ను యుద్ధంలో నిలవరించటం కష్టం అని తెలిసిన హనుమంతుడు ఇంద్రజిత్త్ సాధనను నిర్వీర్యం చేసాడని వాల్మీకి రామాయణంలో పెర్కోనబడింది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR