శివుడు తలక్రిందులుగా శీర్షాసనంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం గురించి తెలుసా ?

శివాలయాలలో శివుడు లింగరూపంలోనే ఎక్కువగా దర్శనం ఇస్తుంటాడు. కానీ ఈ ఆలయంలో శివుడు తలక్రిందులుగా శీర్షాసనంలో దర్శనం ఇస్తుంటాడు. అంతేకాకుండా పార్వతి దేవి ఒడిలో కుమారస్వామితో విగ్రహరూపంలో దర్శనమివ్వడం ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత. ఈవిధంగా శివుడు తలక్రిందులుగా శీర్షాసనంలో దర్శనం ఇచ్చే ఏకైక ఆలయం ఇదేనని చెబుతారు. మరి శివుడు తలక్రిందులుగా శీర్షాసనంలో దర్శనమిచ్చే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో శివుడు ఎందుకు శీర్షాసనంలో దర్శనం ఇస్తుంటాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Shaktheeswara Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణానికి 4 కి.మీ. దూరంలో యనమదుర్రు అనే గ్రామంలో శ్రీ శక్తీశ్వరాలయం కలదు. ఇక్కడి శక్తీశ్వరుడు స్వయంభువు. ఈ ఆలయంలో శివపార్వతులు వెలసిన పీఠం ఏకపీఠం కావడం ఒక విశేషమైతే, ఇదంతా ఒక పెద్ద శిలగా భూగర్భంలో నుంచి చొచ్చుకొని ఉండటం మరొక అధ్బుతం. ఇంకా ఈ ఆలయంలో శక్తీశ్వరుడు శీర్షాసనంలో తపోనిష్టుడై ఉండటం ఈ ఆలయంలో కనిపించే మహా అధ్బుతం. అయితే జటా ఝుటం, నొసట విభూతి రేకలు, నాగాభరణము స్వామి వారి విగ్రహంలో స్పష్టంగా కనబడతాయి.

Sri Shaktheeswara Temple

ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, శంబరుడు అనే రాక్షసుని సంహరించేందుకు యముడు తన శక్తి చాలక శివుడిని ప్రార్ధించాడు. అయితే ఆ సమయంలో ఈశ్వరుడు యోగముద్రలో ఉండడంతో పార్వతి అమ్మవారు తన శక్తిని వరంగా అనుగ్రహించి యముడి బలాన్ని గొప్పగా పెంచింది. ఆ శక్తితో యముడు శంబరుణ్ణి సంహరించాడు. యమధర్మరాజు కోరిక మేరకు శీర్షాసన స్థితిలో ఉన్న శివుడు అమ్మవారి తో సహా ఆ క్షేత్రం నందు వెలిశాడని స్తల పురాణం.

Sri Shaktheeswara Temple

ఈ ఆలయానికి తూర్పువైపున శక్తి గుండం అనే చెరువు ఉంది. కాశీలోని గంగ అంతర్వాహినిగా ప్రవహించి ఈ చెరువులో కలుస్తుందని భక్తుల విశ్వాసం. ఈ చెరువు తవ్వకాలలో సర్పం ఆకారంలో ఉన్న ఆరు అడుగుల శిల ఒకటి బయటబడింది. ఈ శిలను సుబ్రమణ్యేశ్వరునిగా భావించి ఆలయంలో ప్రతిష్టించి, ఆనాటి నుండి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ శక్తి గుండంలోని నీటితోనే స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు.

Sri Shaktheeswara Temple

మహాశివరాత్రి పర్వదినాన పార్వతి పరమేశ్వరుల కళ్యాణం మరియు తెపోత్సవం అతి వైభంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు.

ఈవిధంగా శివుడు శ్రీ శక్తీశ్వరుడిగా ఈ ఆలయంలో వెలిసి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR