మన హిందూ సంప్రదాయంలో ఎన్నో నమ్మకాలు ఉంటాయి. ప్రతి నమ్మకం వెనుక ఏదో ఒక పరమార్థం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఉత్తర దిక్కున తల పెట్టి నిద్రించడం వాస్తు దోషము అని మన పూర్వికులు చెబుతుంటారు. ఇలా ఉత్తరం వైపు నిద్రించకూడదని శాస్రాలే కాదు సైన్స్ కూడా చెబుతుంది. మరి అలా అనడం వెనుక కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భూమికి అయస్కాంత క్షేత్రం ఉంటుందని చదువుకున్నాం కదా. ఉత్తర, దక్షిణ ధృవాలు కూడా ఉంటాయి. ఇవి అయస్కాంత క్షేత్రాల్లా పనిచేస్తాయి. అలాగే మనిషిలో కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఈ క్రమంలో తల వైపు ఉత్తర దిశ క్షేత్రం, కాళ్ల వైపు దక్షిణ దిశ క్షేత్రం ఉంటుందట. అందుకనే తలను ఉత్తరం వైపు పెట్టకూడదని చెబుతారు. ఎందుకంటే శరీర పరంగా తల వైపు ఉత్తర దిశ క్షేత్రమే ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి భూమిపై ఉండే ఉత్తర దిశకే పెడితే అప్పుడు సజాతి ధృవాలు రెండు వికర్షించుకున్నట్టు అవుతుంది. దీంతో శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తాయి.
మన శరీరంలో అత్యంత విలువైన శక్తి వంతమైన మెదడు ఆ ఉత్తర దిశలో ఉన్న ఆయస్కాంత శక్తి ప్రభావంతో మెదడులో ఉన్న కోబాల్ట్ నికిల్ ఐరన్ కణాలను ఆకర్షించడం వలన మెదడులో ఉన్న ప్రభావంతమైన శక్తిని కోల్పోవడం జరిగి తరచు పీడకలలు రావడం,అర్ధరాత్రి మేలుకువ రావడం,సరిగ్గా నిద్ర పట్టక పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఉత్తర దిశగా తలను పెట్టి నిద్రించడం వల్ల అయస్కాంత క్షేత్ర ప్రభావం శరీరంపై పడుతుంది. దీంతో బీపీ పెరుగుతుందట. గుండె సమస్యలు వస్తాయట. రక్త నాళాల్లో రక్తం గడ్డకడుతుందట. ఇంకా పక్షవాతం వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఉత్తర దిక్కు తప్ప ఏ దిక్కులో నిద్రించిన ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.