ఆకాశ దీపం ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి గల కారణం ఏమిటి ?

0
240

శివ కేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. అంతేకాదు కార్తీక మాసం ఋషులకు, పితృదేవతలకు, పితృపతి యమ ధర్మరాజునకూ ప్రియమైన మాసము. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వెళ్లాడ దీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు.

ఆకాశ దీపంతాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం వుంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది.

ఆకాశ దీపందీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమతమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

ఆకాశ దీపంఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెలుతుంటారు. ఈ ఆకాశదీపాన్నే యమ దీపమని కూడ వ్యవహరిస్తారు. అయితే సామాన్యంగా దీపం వెలిగించి దేవతలను, ఋషులను ఆహ్వానిస్తాం. కానీ, ఆకాశదీపారాధన చేసి యమ ధర్మరాజును తమ వైపు రావద్దు అని సూచిస్తున్నట్లుగా వేధాల సారాంశం.

Yamuduఅప్పుడు ఆకాశ దీపాన్నిచూచి యముడు తిరిగి తనలోకానికి వెళతాడని ఆకాశ దీపం కనపడని ఊరికి, ఇంటికి వస్తాడని పురాణ వచనం. మోక్షం కోరినా, కోరకున్నా యముడు రావద్దని అందరూ అనుకుంటారు. కావున ప్రతి ఒక్కరూ ఆకాశదీపాన్ని ఈ కార్తిక మాసములో వెలిగించి ఇష్టదైవాన్ని, పితృ దేవతలను ఆహ్వానించి పితృపతిని మాత్రం ఆశీస్సులు అందజేయమని మాత్రమే కోరతారు. ఆకాశ దీపం ఉన్న ఇంటికి లక్ష్మీ నారాయణులు వస్తారని లేని ఇంటికి యమధర్మరాజు వస్తాడని స్కాందపురాణ వాక్యం.

 

SHARE