నాగదోషం ఉన్నవారు ఎక్కువగా తరలివచ్చే ఈ ఆలయం గురించి మీకు తెలుసా ?

0
3554

నాగదేవత ఎప్పుడు ఇక్కడి ఆలయంలో కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా నాగదోషం ఉన్నవారు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శించి వారి దోషాన్ని పోగొట్టుకుంటారని ప్రతీతి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో కొలువై ఉన్న ఆ స్వామి వారు ఎవరు? ఆ ఆలయ పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kukke Shri Subrahmanya Temple

కర్ణాటక రాష్ట్రానికి పడమటి అంచున ఉన్న పశ్చిమ కనుమలు అనే పర్వతాల వరుసల నడుమ దట్టమైన అడవుల మధ్యలో మారుమూలుగా మంగుళూరు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కుక్కే సుబ్రమణ్య ఆలయం ఉంది. పూర్వము దీనిని కుక్కేపట్నం అని పిలిచేవారు. క్రమంగా అది కుక్కే సుబ్రమణ్యగా పిలువబడుతుంది. ఇది పరశురామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కుమార పర్వతం పైన పూర్వం దేవతలు కుమారస్వామిని దేవా సేనాధిపతిగా అభిషేకించినట్లు స్థల పురాణం తెలియచేస్తుంది.

Kukke Shri Subrahmanya Temple

ఈ క్షేత్రానికి సుబ్రమణ్య అనే పేరు రావడానికి కొన్ని కథనాలు ఉన్నాయి. కుక్కై అంటే కన్నడంలో బుట్ట అని అర్ధం. పూర్వము ఈ స్థలంలో బుట్టలో శివలింగం ఉండటం వలన కుక్కై గా ఈ క్షేత్రం పిలువబడుతుంది చెబుతారు. ఇంకో కథనం ప్రకారం సంస్కృతంలో కుక్షి అంటే పొట్ట అని అర్ధం. గుహాంతర్భాగాన్ని కూడా కుక్షి అని అంటారు. నాగలోకానికి అధిపతి అయినా వాసుకి తపస్సుకు మెచ్చి దేవసేనా సమేత సుబ్రమణ్య స్వామి వాసుకిలో ఒక అంశమై నిలిచి, అనంతరం ఇక్కడ ఉన్న గుహలో వెలిశాడని అంటారు. ఈ గుహలోని శివలింగాన్ని వాసుకి ప్రతిష్టించాడని స్థల పురాణం.

Kukke Shri Subrahmanya Temple

ఇక పురాణానికి వెళితే, నాగలోకాధిపతి అయినా వాసుకి ఈ ప్రదేశంలో శివుని కోసం తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యేక్షమై నీవు ఇక్కడే ఉండిపో, ముందుకాలంలో నా కుమారుడు కూడా ఇక్కడకు వచ్చి నీతో పాటుగా నివాసం ఉంటాడు. ఈ క్షేత్రం నీ పేరు మీదగా ప్రసిద్ధమవుతుందని చెప్పడటా. అంతేకాకుండా, అప్పుడు తన అంశతో నింపిన ఒక శివలింగాన్ని ప్రతిష్టించి, ఇక్కడికి వచ్చి నిన్ను దర్శించిన వారికీ సర్వరోగాలు నయం అవుతాయని వరాన్ని ఇచ్చాడట. ఆవిధంగా ఇక్కడ ఆలయంలో వాసుకి పడగ నీడనే ఉండే ఈ శివలింగాన్ని కుక్కే లింగం అని అంటారు.

Kukke Shri Subrahmanya Temple

కొంతకాలం తరువాత కుమారస్వామి జన్మించి, తన శూలంతో తారకాసురుడిని, అతని తమ్ములను సంహరించి ఇక్కడ ఉన్న ధారా తీర్దానికి వచ్చి, ఈ నదిలోని నీటితో తన శూలాన్ని కడిగి పవిత్రం చేసుకుంటాడు. అందువల్ల ఈ తీర్థంలో స్నానము చేసి ఈ స్వామిని దర్శిస్తే సర్వపాపాలు కడగబడిపోతాయని భక్తుల నమ్మకం.

Kukke Shri Subrahmanya Temple

అయితే అలా, ఈ నదిలో స్నానం చేసి కూర్చొని ఉన్న కుమారస్వామి వద్దకు వాసుకి వచ్చి, కుమారస్వామికి నమస్కరించి , శివుడు చెప్పిన విషయాన్ని చెబుతాడు. అది తెలిసిన ఆ స్వామి ఆనందించి, తన అంశతో ఒక భాగాన్ని ఇక్కడ ఆవాహన చేసి, ఇక ముందు తనను సేవించడానికి వచ్చే భక్తులు వాసుకిని గూడా సేవిస్తారని వరం ఇస్తాడు.

Kukke Shri Subrahmanya Temple

ఈ ఆలయంలో ఉన్న విగ్రహమూర్తి యొక్క పై భాగంలో నెమలి వాహనం మీద కూర్చొని ఉన్న కుమారస్వామి, దాని క్రిందుగా ఏడూ పడగలతో ఉన్న వాసుకి, వాసుకి పడగ నీడలో కెక్కేలింగేశ్వర మూర్తులు కొలువై ఉన్నారు.

SHARE