వాలి ఎవరి అనుగ్రహంతో పుట్టాడు? అతని జన్మ రహస్యం ఏంటో తెలుసా ?

రామాయణంలో రాముడు వధించిన వాలి బలవంతుడని అందరికి తెలుసు. రావణుడు సైతం వాలి చేతిలో ఓడిపోయి సంధి చేసుకొని స్నేహం చేసాడు. రాముడంతటి వాడే వాలిని నేరుగా ఎదుర్కోలేక చెట్టు చాటు నుండి బాణం వేసాడు. ఎందుకంటే ఎదురుగా వచ్చిన వారు ఎంతటి యోధులైన వారి శక్తిని హరించే వరం వాలికి ఉంటుంది. అటువంటి వాలి ఎవరి అనుగ్రహంతో పుట్టాడు? అతని జన్మ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
Valiఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ యోగ ముద్రలో ఉండగా కంటి నుండి నీరు వస్తుంది. ఎందుకో బుద్ధి పుట్టి బ్రహ్మ తన చేత్తో కన్నీటిని పట్టుకుంటారు. ఆ కన్నీటినుండి వృక్షకవజస్సు అనే వానరుడు జన్మిస్తాడు. బ్రహ్మ ఆ వనరుణ్ణి పండ్లు తింటు తింటు బ్రతకమని చెప్పి భూమి మీద వొదిలేస్తాడు . బ్రహ్మ చెప్పినట్టు వృక్షకవజస్సు భూమ్మీద దొరికే పండ్లు  తింటు తిరుగుతూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక కొలను దగ్గరికి వెళ్తాడు కొలను లో తన ప్రతిరూపం చూసి వేరొక వానరం తనతో యుద్ధం చేయడానికి వచ్చిందని అనుకోని కొలనులోకి దూకుతుంది. కానీ లోపల ఇంకొక వానరం ఉండదు. ఈ కొలనులో దిగిన మగవారు ఆడవారిగా మారతారు అని పార్వతి దేవి ఒక సందర్భంలో శపిస్తుంది.
Vali
 ఆ శాపం వల్ల వృక్షకవజస్సు ఆడ వానరంగా మారుతుంది. ఆడ రూపంలో ఉన్న వృక్షకవజస్సుని చూసి   సూర్యుడు, ఇంద్రుడు మోహిస్తారు. వెంటనే ఇంద్రుడు తన తేజస్సును వృక్షకవజస్సు తల మీద ఒదులుతాడు. అది వాలం దాకా వెళ్లి వాలి జన్మిస్తాడు. తన రూపం చూసి మోహించి సూర్యుడు కూడా కంఠం మీద తేజస్సుని వేస్తాడు. కంఠం మీద సుగ్రీవుడు జన్మిస్తాడు. సూర్యుడు, ఇంద్రుడు అంతటి వాళ్ళు ఒక వానరాన్ని మోహించడం ఏంటి అని అనే సందేహం రాకమానదు.
Valiఅయితే లోక కళ్యాణం కోసం రాముడు జన్మించబోతున్నాడు. రామునికి సహాయం చేసే గొప్ప యోధుల జన్మ క్షేత్రం అంతే గొప్పగా ఉండాలని వృక్షకవజస్సు ద్వారా వాలి సుగ్రీవుల జన్మను బ్రహ్మ సృష్టిస్తాడు. మరి వాలి రామునికి ఏ విధంగా సహాయపడ్డాడు అనే ప్రశ్న మనలో చాల మందికి రావచ్చు. వాలి దుందుభి, మాయావి లాంటి పెద్ద పెద్ద రాక్షసులను మట్టుపెట్టి రాముని దారిని సులభం చేసి రాముని చేతిలో ప్రాణాలు ఒదిలాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR