ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు!

  • మనం ఆరోగ్యం గా ఉండాలన్నా శరీరం సక్రమంగా పనిచేయలన్నా అన్నీ రకాల పోషకాలు సరిపోయేంత అందించాలి. ఏ ఒక్కటి తగ్గినా సమస్యలు తప్పవు. అందులో ఫైబర్ కూడా ఒకటి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్థాలతో నిండి ఉండాలి. మన శరీరంలో వ్యవస్థలు సక్రమంగా పనిచెయ్యాలంటే… మనకు ఫైబర్ (పీచు పదార్థం) అత్యంవసరం.
  • ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు… బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఫైబర్ అనేది మొక్కలు, పండ్ల నుంచీ వస్తుంది. ఇందులో రెండు రకాలుంటాయి. కరిగిపోయేది, కరగనిది. కరిగిపోయే ఫైబర్… మన శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కరగని ఫైబర్ శరీరంలో నిల్వ ఉన్నా… అన్ని వ్యవస్థల్నీ క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది.
1
  • మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తగ్గితే మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. అందువల్ల మనం తినే ఆహారంలో ఫైబర్ ఉండేలా చేసుకోవాలి. అది గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. పండ్లు, కూరగాయలు, బీన్స్, ధాన్యాలు వంటి వాటిల్లో పీచు పదార్థం అధిక మోతాదులో ఉంటుంది. పండ్లపై గల తొక్కభాగంలో పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది. ఆపిల్ పండు తొక్కను తీయకుండా అలానే తీసుకుంటే మంచిది.
  • పచ్చి కూరగాయలు, ఆకుకూరలలో పీచు పదార్థమే కాకుండా శరీరానికి కావలసిన మెగ్నిషియం కూడా లభిస్తుంది. గోధుమలు, ఓట్స్, మొక్కజొన్న, బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ ఇవన్నీ ఫైబర్ బాగా ఉండేవే. అందువల్ల వీటిని మీ డైట్‌లో చేర్చుకోవాలి. తెల్లని బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ లేదా తెల్లని బియ్యం కంటే బ్రౌన్ రైస్ వంటివి మంచివి. బ్రౌన్ రైస్ లో పీచు పదార్ధం అధికంగాఉంటుంది.
2
  • గింజలు, పప్పులు మన ఇళ్లలో, పోపుల డబ్బాలో ఉండేవే. వాటిలో ఫైబర్ ఎక్కువ. అందువల్ల మనం తినే రోజువారీ ఆహారంలో అవి ఉండేలా చేసుకోవాలి. అంతేకాదు వాటిలో ప్రోటీన్స్, ఐరన్, ఫొలేట్, విటమిన్స్, మాంగనీస్ ఉంటాయి. జీడిపప్పు, బాదం, పిస్తా వంటి పప్పుల్లో మంచి ఫ్యాట్‌తోపాటూ… ఫైబర్ కూడా ఎక్కువే. పచ్చివి, డ్రై, రోస్ట్ చేసిన పప్పుల్ని తినవచ్చు.
3
  • అవిసె గింజల లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ. ఇవి తేలిగ్గా జీర్ణం అవ్వడమే కాదు… రుచిగా కూడా ఉంటాయి. వీటిని వేపుకొని తినవచ్చు. టైమ్ పాస్‌గా కూడా తినవచ్చు. బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయని భావిస్తారు. కానీ బెర్రీ పండ్లలో పీచు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు, లేదా రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటివి బాగా తినండి.
4
  • బ్రకోలీలో విటమిన్ సి, కాల్షియంతోపాటూ… ఫైబర్ కూడా ఎక్కువే. దీన్ని ఎక్కువగా ఉడికించకుండా తింటే ఇంకా మేలు. ఫలితంగా పోషకాలన్నీ బాడీకి అందుతాయి. ఆవకాడో పండ్లను సలాడ్స్, ఎగ్స్, టోస్ట్ ఇలా రకరకాలుగా మిక్స్ చేసి తినవచ్చు. అవి మంచి రుచిగా ఉండటమే కాదు… శరీరానికి మంచివి కూడా. మంచి ఫ్యాట్ అందిస్తాయి. ఒక కప్పు ఆవకాడోలో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
5
  • బీన్స్ అనేది పీచు అధికంగా ఉన్న ఆహారం.వీటిని వండిన తర్వాత కూడా పీచుఅధిక మొత్తంలో ఉంటుంది.ఫ్రెంచి బీన్స్, కిడ్నీ బీన్స్ వీటిని అయినా తినవచ్చు. గోంగూర, బచ్చలి, మెంతి, తోటకూర,చుక్కకూర వంటి ఆకుకూరల్లో పీచు సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో భాగంగా ఆకుకూరలను చేసుకోవచ్చు.
6
  • యాపిల్ అనేది రకరకాల సూక్ష్మక్రిములను హరిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువే. ఒక యాపిల్‌లో 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది ధమనుల్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
7

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR