నిమ్మకాయల వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆకులతో కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఐరన్ , క్యాల్షియం , విటమిన్ ఏ , విటమిన్ బి 1 , విటమిన్ సి , ప్లేవనాయిడ్స్ , రైబోఫ్లోవిన్ , సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. నీళ్లను వేడి చేసి అందులో కొన్ని నిమ్మ ఆకుల్ని వేసి ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి . ఇలా నెల రోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి, ఆస్తమా వంటివి తగ్గిపోతాయి. అయితే నీటిని మాత్రం మరిగించకూడదు. కేవలం వేడినీటితోనే నానబెట్టాలి.
- మానసికం గా ఆందోళన చెందుతున్నవారు… నిమ్మ ఆకులను నలిపి, ఆ వాసన పిలిస్తే ఒత్తిడి తగ్గడంతో పాటు ఉత్సహాంగా కూడా ఉండే అవకాశం ఉంది. గ్లాసు వేడి నీటిలో నాలుగు తాజా నిమ్మ ఆకులను వేసి మూడు గంటలు నానాబెట్టి తాగితే.. నిద్రలేమి సమస్య, గుండె దడ, నరాల బలహీనత వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండడం వలన బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో కూడా వీటిని వాడుతుంటారు.
- నిమ్మ ఆకులను మెత్తని పేస్టుగా చేసి దానికి కొంచెం తేనే కలిపి ఫేస్ ప్యాక్ గా వాడితే, ముఖం మీద ఉన్న మచ్చలు తగ్గిస్తుంది. నిమ్మ ఆకులును పేస్ట్ లా తయారు చేసుకొని ముల్తానీ మట్టిలో కలిపి ఈ మిశ్రమాన్ని చర్మానికి రాస్తే కాంతివంతంగా మారుతుంది.. నిమ్మ ఆకుల ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు, నలుపు తొలగిపోతుంది. నిమ్మ ఆకులను మెత్తగా నూరి పళ్లకు పట్టించడం వలన నోటి దుర్వాసన తగ్గిపోతుంది. అంతేకాకుండా పళ్ళలో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేసి దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
- స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసుకోని స్నానం చేస్తే, అలసటను తగ్గించి హాయిగా ఉండడంతో పాటు చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా స్నానం చేయటం వలన శరీర దుర్గంధం పోయి చక్కటి వాసన వస్తుంది. ఈ ఆకులను నలిపి చర్మంపై రుద్దితే చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిమ్మ ఆకులలో యాంటీబయోటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. నిమ్మ ఆకుల రసాన్ని గాయాలు, పుండ్లు పై రాస్తే త్వరగా మానిపోతాయి.
- ఇక కరోనా పరిస్థితుల్లో అందరూ వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మన శరీర భాగంగా తరచూ మురికిగా మారే బాగం చేతులు. కాబట్టి చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన శరీరంలోకి ప్రవేశించే క్రిముల్లో అత్యధిక శాతం క్రిములు చేతుల ద్వారానే ప్రవేశిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం మన చేతులను ఎంతో చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇందుకు మనకు హ్యాండ్ వాష్‌లు ఉపయోగపడతాయి.
- హ్యాండ్ వాష్‌లతో మనం చేతులను శుభ్రం చేసుకోవడంతో ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే తరుచూ రసాయనాలతో చేసిన హ్యాండ్ వాష్ లు వాడటం వలన చేతులు తేమను, సున్నితత్వాన్ని కోల్పోతాయి. కాబట్టి వాటి స్థానంలో నాచురల్ హ్యాండ్ వాష్ వాడటం ఉత్తమమైనది. ఆ స్థానంలో నిమ్మ ఆకులను కూడా హ్యాండ్ వాష్ లా వాడుకోవచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు రాసుకుంటే బాక్టీరియా నశిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు. 2 నిమ్మ ఆకులను తీసుకుని నలుపుతూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వలన చేతులపై ఉన్న బ్యాక్టీరయాను చంపుతుంది. అయితే నిమ్మ ఆకులను మితంగా వాడాలి అని గుర్తుంచుకోవాలి.