భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీ దేవి. శ్రీమహావిష్ణువు దేవేరి లక్ష్మీదేవి అష్టావతారాలలో వరలక్ష్మీ ఒకరు. ఆ వరలక్ష్మీ దేవి పేరున ఉన్న వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.
శూన్యమాసం ముగిసిన తర్వాత వచ్చే శ్రావణమాసం కోసం పెళ్లీడు పిల్లలు , పెళ్ళైన కొత్త దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చేదికనుక శ్రావణం. మండే ఎండాకాలమైన గ్రీష్మ ఋతువు ,వెళ్లి చల్లబరచే వర్ష ఋతువు ప్రవేశించి ఉపశమనం కలిగిస్తుంది. పంటలు వేసేకాలం. భూమి ఆకుపచ్చ చీర కట్టుకొని ముచ్చటగా దర్శనమిచ్చి మనశ్శాంతి కల్గిస్తుంది. వర్షాలు విపరీతంగా కురిసి నదులన్నీ నిండు గర్భిణీ స్త్రీలు లాగా నిండుగా ప్రవహిస్తాయి. అలాగే శ్రావణ మాసంలో నిండుగా పండుగలు కూడా కనబడుతాయి.
మొదటగా శ్రావణ మంగళవారాలలో స్త్రీలు మంగళ గౌరీ నోము నోస్తారు. ఈ మాసంలో ప్రతి శుక్రవారం పవిత్రమైందే. మూడవ శుక్రవారం అంటే పౌర్ణమి ము౦దు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ముత్తైదువలు అత్యంత భక్తీ శ్రద్ధలతో దీర్ఘ సుమాంగల్యం కోసం అమ్మవారిని పూజిస్తారు. కొబ్బరి కాయకు పసుపు కు౦కుమపెట్టి కలశంపై ఉంచి పైన రవికముక్కను అందంగా అలంకరించి అమ్మవారికి కళ్ళూ ముక్కు చెవులు నోరు ఏర్పరచి ,ఆభరణాలు తొడిగి ,పుష్పహారాలతో శోభిల్లజేసి తమ ఇంట లక్ష్మీదేవి వెలసినట్లు పరవశిస్తారు.
అమ్మవారిని ఈ రకంగా చూసి మురిసిపోయి ధన్యులవుతారు. ఈ పండుగ స్త్రీలకు ప్రత్యేమైన పండుగ కాబట్టి, అందరూ స్త్రీలతో పాటు గర్భిణీలు కూడా చేసుకోవచ్చా అనే ధర్మసందేహం చాలా మందిలో కగలవచ్చు. వరలక్ష్మీ వ్రతం సమయంలో ఏ పనులు చేయాలి… ఏమి చేయకూడదు.. గర్భిణీ స్త్రీలు ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని జోతిష్యశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు పూజ చేయాలనుకుంటే ఫర్వాలేదు, కానీ వారు ఉపవాసానికి దూరంగా ఉండాలి, లేకుంటే అది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ విషయంలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
వరమహాలక్ష్మి వ్రతం పూజా, ముహూర్తం , వ్రత ప్రాముఖ్యత అలాగే గర్భిణీలుకు మందుల ప్రభావం ఉంటుంది. కాబట్టి, ఉపవాసం కష్టం అవుతుంది కాబట్టి, గర్భిణీలు ఉపవాసం ఉండకపోవడం మంచిది. గర్భిణీలు పూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కాకపోతే గర్భిణులు ఎక్కువ సేపు కూర్చోలేరు కాబట్టి వేగంగా వ్రతవిధి పూర్తిచేస్తే తీర్థ ప్రసాదాలు తీసుకుని విశ్రాంతి తీసుకోగలుగుతారు. అలాగే రీసెంట్ గా ప్రసవించిన వారు మరియు శిశువుకు 22 రోజుకూడా దాటని వారు ఈ వరలక్ష్మీ వ్రతంను జరుపుకోకూడదు.