చిన్న పిల్లలను వైరస్ నుండి రక్షించుకునే మార్గాలు

కరోనా సెకండ్ వేవ్ ధాటికి జనం విల్లవిల్లాడుతున్నారు. ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరుగుతోంది. పెద్దలతో పాటూ పిల్లలను ఈ వైరస్‌ను వెంటాడుతోంది. సెకండ్‌వేవ్‌ బాధితుల్లో చిన్నారులూ ఉన్నారు. కొద్దిరోజులుగా చిన్నపిల్లల వైద్యుల దగ్గరకు వస్తున్న కేసుల్లో కరోనా బాధితులు ఉన్నారు. కరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. వచ్చిన కేసుల్లో కూడా పిల్లల్లో స్వల్ప లక్షణాలే ఉండటం.. వైద్యం అందించిన నాలుగైదు రోజుల్లోనే కోలుకోవడం ఊరటనిచ్చే అంశాలు. కానీ ప్రస్తుతం చిన్నారుల్లో కూడా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన దాఖలాలు చాలా తక్కువగా కనిపించాయి. ఇప్పుడు 18 సంవత్సరాల లోపు వారికి ఇన్ఫెక్షన్ సోకుతున్న కేసులు భారీగా పెరుగుతున్నాయి.

పిల్లలకు కరోనాకరోనా సెకండ్‌వేవ్‌లో పిల్లలకు కరోనా సోకడానికి డబుల్‌ మ్యూటెంట్‌ కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ వైరస్‌కు త్వరగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటుగా రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేసే సామర్థ్యం కూడా ఉంది. దీంతో పిల్లల్లో ఈ వైరస్‌ సులభంగా సోకుతోంది. ఫస్ట్ వేవ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారని, లాక్‌డౌన్ పెట్టారని.. అందుకే అప్పుడు పెద్దగా కేసులు లేవంటున్నారు వైద్యులు. సెకండ్‌వేవ్‌లో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో పిల్లలకు వైరస్‌ ఎక్కువగా సోకుతోంది అంటున్నారు. మొన్నటి వరకు స్కూళ్లు పెట్టడం.. పిల్లల్ని తల్లిదండ్రులు బయటకు తీసుకెళ్లడం కూడా కారణాలుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఐదేళ్లకంటే తక్కువ వయసు వారికి ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి వైరస్‌ వ్యాపిస్తోందని గుర్తించారు.

పిల్లలకు కరోనాఅలాగే కరోనా సోకడం వల్ల పిల్లల్లో యాంటీబాడీలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతాయంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని సందర్భాల్లో అవి శరీరంలోని ఇతర అవయవాలకు హాని చేస్తాయంటున్నారు. జ్వరం, విరేచనాలు, కడుపునొప్పి, గుండెకొట్టుకునే వేగం పెరగడం, ఒంటిపై దద్దుర్లు రావడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. దీన్ని వెంటనే గుర్తించి చికిత్స చేస్తే మంచిది అంటున్నారు. అయితే వీటితో పాటు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే కచ్చితంగా కరోనావైరస్ సోకిందని అనుమానించాలి. నిర్లక్ష్యం చేస్తే.. గుండెలో రక్తనాళాలు ఉబ్బడం వంటి సమస్యలు ఏర్పడవచ్చని ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెద్దలు పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలకు కరోనాపసివాళ్లు నొప్పిగా ఉందని చెప్పలేరు కాబట్టి వాళ్లు నిరంతరం ఏడుస్తున్నా లేదా విచిత్రంగా ప్రవర్తిస్తున్నా నొప్పితో బాధపడుతున్నారని అనుమానించాలి. ఎందుకంటే 18 ఏళ్లు దాటినవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరి 18 ఏళ్ల లోపున్నవారికి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ పై ఇంకా ఎటువంటి నిర్ధారణ కాలేదు. మరి 18 ఏళ్ల లోపు వయస్సున్నవారు కరోనా నుంచి ఎలా రక్షించుకోవాలి అంటే…రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఒక్కటే మార్గం. సరైన పోషక పదార్ధాలున్న ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచవచ్చు.

పిల్లలకు కరోనా

  • వీటితో పాటు పిల్లల సంరక్షణ విషయంలో కొన్ని కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి.
  • ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను బయటకు వెళ్లనీయరాదు.
  • తప్పకుండా మాస్క్‌ ధరించేలా తల్లిదండ్రులు చూడాలి.
  • ముక్కు, ముఖం, కళ్లపై చేతులతో రుద్దుకోనివ్వవద్దు. కళ్ల ద్వారా కూడా వైరస్‌ సోకి అవకాశాలుంటాయి.
  • పసిపిల్లలకు వాడే దువ్వెన, బాడీ లోషన్, సబ్బు వగైరాలను వేరుగా ఉంచాలి.
  • పాలు పట్టే ముందు, డైపర్, బట్టలు మార్చే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • మీ పిల్లల బొమ్మలన్నీ శానిటైజ్ చేయాలి.
  • డాక్టర్‌ను సంప్రదించకుండా విటమిన్ మాత్రలు, సిరప్‌లు, ప్రొటీన్ ప్రత్యామ్నాయాలను పిల్లలకు ఇవ్వకూడదు. పిల్లల వయసు, ఎత్తు, బరువుకు తగ్గట్టు వారికి ఇవ్వాల్సిన డోసును డాక్టర్లు నిర్ణయిస్తారు. వారి సలహా పాటించడం ఉత్తమం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR