ఈ రాయి కనుక మన దగ్గర ఉంటె లక్ష్మి దేవి అనుగ్రహం పొందుతారు అంట ?

మన హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు, నమ్మకాలూ అనేవి ఉన్నాయి. ప్రతి నమ్మకం వెనుక ఏదో ఒక కారణం తప్పకుండ ఉంటుందని పండితులు చెబుతారు. అలాంటి నమ్మకాలలో ఇది కూడా ఒకటిగా చెబుతున్నారు. అయితే ఈ రాయి కనుక మన దగ్గర ఉంటె శుభం కలుగుతుందని, చేసే పనిలో విజయం సాధించి లక్ష్మి దేవి అనుగ్రహం పొంది కోట్లకి పడగలెత్తుతారని అంటున్నారు. మరి ఆ రాయి ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? ఈ నమ్మకం వెనుక ఉన్న కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lakshmi Deviమనలో చాలా మంది ఎక్కడికి వెళ్లిన రక రకాల వస్తువులు కొని ఇంట్లో అలంకరణకి తీసుకువస్తుంటారు. ఇందులో చాలా వరకు పూజ మందిరంలో పెట్టుకోవడానికి వివిధ రకాల వస్తువులను తీసుకువస్తుంటారు. కొన్నిటిని మనం పూజ మందిరంలో పెట్టుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ పెంచడమే కాకుండా ధనరాబడిని కూడా పెంచుతాయి. ఆలా ధనరాబడిని తెచ్చిపెట్టేదే స్వర్ణముఖి శిల రాయి.

Lakshmi Deviఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఉంది. ఈ నదిలో దైహిక శిలలు లభిస్తాయని చెబుతుంటారు. ఈ శిలలు చూడటానికి వెండి మరియు బంగారం కలసిన వర్ణంతో ఉంటాయి. కేవలం వర్ణం కాదు లక్షణాలు కూడా ఉన్నాయని అంటారు. వీటిల్లో దైహిక శక్తులు ఉంటాయని భావిస్తారు. అందుకే స్వర్ణముఖి రెండవ బంగారంగా ప్రసిద్ధి చెందింది.

 

Lakshmi Devi Templeఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే అది వారికి కష్టానికి తగిన ప్రతిఫలం విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది.

స్వర్ణముఖి శిల రాయిఈ స్వర్ణముఖిని ఇంట్లో పూజామందిరంలో పెట్టుకొని పూజించడం వలన ధన లాభం పెరగడమే కాకుండా బంగారాన్ని అక్షర్శించే గుణాలు కూడా ఉంటాయంటా. మీ ఇంట్లో బంగారం కలిసి రావాలంటే కచ్చితంగా స్వర్ణముఖి శిల రప్పిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి. ఎవరి ఇంట్లో అయితే ఈ శిల ఉంటుందో వారింట్లో బంగారం సమృద్ధిగా ఉంటుందని, ఆలా వచ్చిన బంగారం ఏ విషయం నుండి ఇంటి నుండి బయటకి వెళ్ళదంటా. ఇంకా అక్షయతృతీయ నాడు ఈ శిలను పూజించడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు అని చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR