సహజసిద్ధమైన కలర్స్ వేసుకోవడం వలన జుట్టు సమస్యలు దూరం చేయవచ్చా

ఈకాలంలో చిన్న పెద్దా అనే వయసు సంబంధం లేకుండా అందరికి జుట్టు తెల్లబడుతుంది. అందుకోసం జుట్టుకు రంగు వేసుకుంటున్నారు. కానీ జుట్టుకు రంగు వేసుకున్నప్పుడు ఆ రంగు పడకపోతే జుట్టు కాంతివిహీనంగా మారుతుంది. అంతేకాక జుట్టు కూడా రాలిపోతుంది. కొంతమందికైతే అలర్జీ రావడం, దురద, మంట లాంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి.

Hairఅయితే ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన కలర్స్ వేసుకోవడం వలన జుట్టు సమస్యలు దూరం చేయవచ్చు. వీటి వల్ల జుట్టు బలంగా, ఆరోగ్యంగా, రాలకుండా ఉంటుంది. అయితే ఈ కలర్స్ ని తేలికపాటి షాంపూతో తలస్నానము చేసాక మాత్రమే ఉపయోగించాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

జుట్టు సమస్యలుజుట్టు బ్రౌన్ కలర్ రావాలంటే ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ కాఫీ గింజలు లేదా కాఫీ పొడి వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి.ఈ మిశ్రమాన్ని వడకట్టి తలకు బాగా పట్టించాలి. 20 నిముషాలు అయ్యాక జుట్టును కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు బ్రౌన్ కలర్‌ లోకి మారుతుంది.

జుట్టు సమస్యలుజుట్టు నలుపు రంగు రావాలంటే ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ కాఫీ గింజలు లేదా కాఫీ పొడి, పావు స్పూన్ లవంగాల పొడి వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి.ఈ మిశ్రమాన్ని వడకట్టి తలకు బాగా పట్టించాలి. 20 నిముషాలు అయ్యాక జుట్టును కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు నలుపు కలర్‌ లోకి మారుతుంది.

జుట్టు సమస్యలుజుట్టుకు పర్పుల్‌ కలర్‌ రావాలంటే ఒక కప్పు నీటిలో బీట్ రూట్ పేస్ట్ వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి రాత్రి సమయంలో జుట్టు మొత్తానికి పట్టించి తల మాడు మీద 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు పర్పుల్‌ కలర్‌ లోకి మారుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR