ఈశాన్యంలో బరువులు పెడితే మన జీవితంలో కూడా బరువులు పెరుగుతాయా???

గృహ వాస్తు గురించి చాలామంది ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఎలాగూ ఇల్లు నిర్మిస్తాము కాబట్టి… అదేదో వాస్తుపరంగా వుండేట్లు చూసుకుంటే మంచిది. అందుకే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే వస్తుంటాయి.

north eastఇంట్లో మొక్కలని పెంచుకునే వారు సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల ప్రక్కన కాని చెట్లను పెంచకూడదు. ఇలా చేయటం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం వుంది. అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి.

plants in houseఈ నేపథ్యంలో ఎక్కువమంది ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని చెబుతుంటారు. ఈశాన్యంలో బరువులు పెడితే ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం…
మన ఇంట్లో ఈశాన్యం దిక్కున బరువులు పెట్టడం పరమ దరిద్రం అని భావిస్తుంటారు. కానీ అలా ఎందుకు చెప్తారు అంటే ఈశాన్యంలో సాక్షాత్తు ఈశ్వరుడు కొలువై ఉంటాడు.

అందువల్ల అక్కడ ఏవైనా వస్తువులు పెట్టడం ద్వారా ఈశాన్య దిక్కు మూసుకుపోతుంది. ఉదాహరణకు పెద్ద బీరువా లాంటి వస్తువులు ఇంటికి ఈశాన్యంలో పెట్టడం వల్ల మనం ఆ వైపు అనవసరంగా వెళ్ళము.
ఒకవేళ అదే స్థలం కనుక ఖాళీగా ఉంటే మనం మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కొలవడం వల్ల మనలో ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

almirahఅందుకోసమే ఈశాన్య దిక్కులో ఎటువంటి వస్తువులు పెట్టుకోకుండా ఖాళీగా ఉంచాలి అని పెద్దలు చెబుతుంటారు. ఈశాన్య దిక్కు ఈశ్వర స్థానం కాబట్టి అక్కడ కూర్చొని ధ్యానం చేయటం వల్ల ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఈశాన్య భాగ దిక్పాలకుడు ఎంతో సున్నితత్వం కలవాడు కాబట్టి ఈశాన్యం వైపు గరికపోచ బరువు కూడా ఉండకూడదు అని పండితులు చెబుతుంటారు.

stress and health problemsఅందువల్ల ఈశాన్య భాగాన చెట్లను కూడా నాటకూడదు. ఆ స్థానంలో బరువులు పెడితే మన జీవితంలో బరువులు పెరుగుతాయి. మన జీవితంలో బరువులు ఉండకూడదు అనుకుంటే, ఈశాన్యంలో బరువులు పెట్టవద్దు అని పండితులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR