శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. భూమిలో పండే బీట్‌రూట్ ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటుంది. బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంటుంది. బీట్ రూట్ లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్ ఇలా మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషాకాలు ఉన్నాయి. బీట్‌రూట్‌ను చర్మ సౌందర్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
అందుకని కొంతమంది తరుచూ బీట్‌రూట్ తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా రోజూ బీట్‌రూట్ తింటున్నారా? మరి, బీట్‌రూట్‌ను రోజూ తినడం వల్ల శరీరానికి లభించే ప్రయోజనాలు ఏమిటీ? పోషకాలు సమృద్ధిగా ఉండే బీట్ రూట్‌ను నిత్యం తీసుకుంటే సూపర్ పవర్స్ వచ్చేస్తాయా? ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్‌లో నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో అధిక రక్తపోటుకు చెక్ పెట్టేందుకు సహాయం చేస్తుంది. బీట్‌రూట్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. బీట్‌రూట్ వల్ల రక్తంలో నైట్రేట్ రెట్టింపవుతుంది. దీనివల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి.
బీట్‌రూట్ జ్యూస్ వల్ల లివర్ శుభ్రమవుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. చర్మం, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
బీట్‌రూట్‌ను తినడం ఇష్టం లేని వారు, కనీసం దాని జ్యూస్‌ను అయినా రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే చాలా మంచిది. బరువు తగ్గాలనుకునేవారు రోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం ఉత్తమం. ప్రతిరోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది.
బీట్‌రూట్ నిత్యం తినేవారిలో శారీరక దారుఢ్యం పెరుగుతుంది. బీట్‌రూట్‌ను నిత్యం తీనేవారికి గుండె సమస్యలు ఉండవు. ముఖ్యంగా అథ్లెట్స్ బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల వారిలో స్టామినా పెరుగుతుందని తెలుస్తోంది. ఆటలకు 90 నిమిషాల ముందు బీట్‌రూట్ జ్యూస్ తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుందట.
రక్త హీనత సమస్య ఉండదు: రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య ఉండదు. బీట్‌రూట్ జ్యూస్ వల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది.
బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
బద్దకాన్ని వీడి ఉత్సాహంగా ఉండాలంటే బీట్‌రూట్ జ్యూస్ తాగండి. ఇది ఎనర్జీ డ్రింక్ కంటే ఎక్కువ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలసట కూడా రాదు. బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే హైబీపీ సమస్య ఉండదు. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.
గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.