Home Health ఇసుకలో నడవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?

ఇసుకలో నడవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?

0

మట్టి మీద నడిస్తే ప్రకృతిలో మనిషికి ఉన్న సంబంధం గుర్తుకు వస్తుంది. మనసు ఉత్సాహంగా తయారవుతుంది. ఒక్కసారిగా కాళ్లలో శక్తి తిరిగివస్తుంది. కానీ పొద్దున్న నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తుంటాం. కొందరైతే ఇళ్లలోనూ చెప్పులు వేసుకుంటుంటారు. ఒక్క డైనింగ్ టేబుల్ పై తప్ప మిగతా సమయమంతా చెప్పులు వేసుకునే ఉంటారు.

What are the benefits of walking in the sand?ప్రకృతి వైద్యంలో మాత్రం రోజూ కనీసం 10నుండి 15నిమిషాల పాటయినా చెప్పులు లేకుండా ఇసుకలో నడవమని చెబుతుంటారు. చెప్పులు లేకుండా నడవమన్నారని తారు రోడ్ల మీద, సిమెంటు రోడ్ల మీడ నడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. భూమితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి.

ఇలా నడవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చెప్పులు లేకుండా భూమి మీద నడవడం వలన భూమిపై ఉండే శక్తివంతమైన సూక్ష్మ జీవులు మన గోర్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పల్లెటూళ్లలో ఉండేవారికి ఎక్కువ రోగనిరోధక శక్తి ఉండడానికి ఇది కూడా ఓ కారణమే.

ఇసుకలో నడవడం వల్ల బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. నొప్పులు తగ్గుతాయి. భూమిలో ఉండే ప్రత్యేక విద్యుత్ శక్తి కారణంగా మన శరీరంలోకి కొన్ని కణాలు పాస్ అవుతుంటాయి. దానివల్ల శరీరంలో నొప్పులు తగ్గిపోతాయి. ఇది మంచి ఆక్యుప్రెషర్ లాగా పనిచేసి, శరీరానికి మంచి పాజిటివ్ శక్తిని అందిస్తుంది.

Exit mobile version