గర్భవతులు తక్కువ నీటిని తీసుకోవడం వల్ల వారిలో వచ్చే సమస్యలు ఏంటి?

చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్య రహస్యం నీళ్లు. నీళ్లు ఎక్కువగా తాగే వారు అనారోగ్యాల బారిన పడరు. అందుకే వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాలని చెబుతుంటారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే అధిక నీరు అవసరం అవుతుంది. ఇక మనం బయటికి వెళ్లి పనులు చేస్తున్నప్పుడు మన శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో బయటకు వెళుతుంది.

ow water intake in pregnant womenఅందుకోసం మనం ప్రతిరోజు ఐదు నుంచి ఆరు గ్లాసుల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. మరి గర్భవతులు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తీసుకోవాలి? తక్కువ నీటిని తీసుకోవడం వల్ల వారిలో వచ్చే సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ow water intake in pregnant womenసాధారణంగా గర్భిణీ స్త్రీలు రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. అదే బిడ్డకు పాలు ఇస్తే ఆ సమయంలో రోజుకు 13 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఎందుకంటే? గర్భవతులుగా ఉన్నప్పుడు శరీరానికి అధిక రక్తం, ఉత్పత్తి చేయడానికి అధిక ద్రవాలు అవసరమవుతాయి.

ow water intake in pregnant womenగర్భిణీ స్త్రీలు ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల అంతర్గత వ్యవస్థలన్నీ బాగా పనిచేస్తాయి, ఇంకా శరీర వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. నీటిని మాత్రమే కాకుండా అధిక మోతాదులో పండ్ల రసాలను కూడా తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలు డీహైడ్రేట్ కాకుండా ఉంటారు.

ow water intake in pregnant womenఅయితే అధిక మొత్తంలో నీటిని ఒకేసారి తీసుకోవడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతాయి. అలా కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు నీటిని తీసుకునేలా చూసుకోవాలి. ఇలా నీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శిశువు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది.

ow water intake in pregnant womenవీలైనంతవరకు గర్భిణీ స్త్రీలు ఎండలో తిరగకపోవడం మంచిది. అలా వెళ్ళినప్పుడు తొందరగా డీహైడ్రేట్ అవుతారు. అంతేకాదు డీహైడ్రేట్ అయిన గర్భిణీ స్త్రీలు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగడం ద్వారా తొందరగా రీహైడ్రాట్ అయ్యే అవకాశం ఉంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR