డెలివరీ సమయంలో సిజేరియన్ కి దారి తీసే పరిస్థితులేంటి?

నార్మల్ పద్ధతిలో డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లీ, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సీ సెక్షన్ చేస్తారు. ఈ రోజుల్లో చాలా వరకూ నార్మల్ డెలివరీ జరగడం లేదు. సీ సెక్షన్ జరుగుతున్నాయి, అంటే సిజేరియన్ చేస్తున్నారు. సిజేరియన్ కంటే కూడా నార్మల్ డెలివరీ అవ్వాలనే చాలా మంది కోరుకుంటారు. ఎందుకు అంటే త్వరగా రికవరీ అవ్వచ్చు అని, వెంటనే హస్పటల్ నుంచి వెళ్లవచ్చు అని.

Caesarean sectionఅయితే నార్మల్ డెలివరీ అవ్వాలని గర్భిణీ మహిళలు కోరుకున్నప్పటికీ కొన్ని తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ ద్వారా బిడ్డని బయటకు తీయవలసి ఉంటుంది. మరి ఆ పరిస్దితులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

Caesarean section->ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చే ప్రాంతం అనువుగా లేకపోవడం, సరిగ్గా తెరచుకోకపోవడం ఈ కారణంతో సీ సెక్షన్ చేస్తారు.

-అలాగే కవలలు ఉన్నా, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా ఆపరేషన్ చేస్తారు.

->ఇక బిడ్డ పొజిషన్ కూడా బయటకు వచ్చేలా డెలివరీకి అనుకూలంగా ఉండాలి.. లేకపోతే సీసెక్షన్ చేస్తారు.

->బేబీ తల పెద్దదిగా ఉన్నా ఆపరేషన్ చేస్తారు.

Caesarean section->బేబీ హార్ట్ బీట్ పెరిగిపోవడం వల్ల కూడా సీ సెక్షన్ చేస్తారు.

-> ఒక్కోసారి బొడ్డు తాడు కట్ అవుతుంది దీని వల్ల బేబికి ఆక్సిజన్ అందదు ఇలాంటి సమయంలో ఆపరేషన్ చేస్తారు.

->ఒక వేళ గర్భిణీకి హై బీపీ ఉంటే కచ్చితంగా ఆపరేషన్ చేస్తారు.

->తల్లికి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR