ఆర్థరైటిస్ ఎన్ని రకాలు, ఇది రావడానికి గల కారణాలు ఏంటి ?

ఈరోజుల్లో వయసు పైబడిన వారితో పాటు చిన్న వయసు వాళ్లకు కూడా ఎదురయ్యే సమస్యలలో ఆర్థరైటిస్ ఒకటి. ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో మంట, నొప్పితో కూడిన వాపులు. ఇవి 170 రకాల కీళ్ళ జబ్బుల సముదాయం. దీని వల్ల కీళ్ళలో నొప్పి, వాపు, బిగుసుకు పోవడం వంటి లక్షణాలు కనపడుతాయి. కీళ్లకు వచ్చే అతి పెద్ద సమస్య ఆర్థరైటిస్ అంటే కీలు లోపలంతా వాచిపోయి.. కదపాలంటేనే తీవ్రమైన నొప్పి, బాధతో.. జాయింటులో ఓ విపత్తు తలెత్తటమన్న మాట.

ఆర్థరైటిస్ రకాలు :

What are the possible causes of arthritis?ఇది కీలు అరిగిపోవటం వల్ల రావచ్చు. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్అంటారు. ఇప్పుడు ఎక్కువ మంది అనుభవిస్తున్న మోకాళ్ల నొప్పుల బాధ ఇదే. ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్‌ తలెత్తి అది కీలుకు చేరటం వల్ల కీళ్లనొప్పి రావచ్చు. దీన్ని ఇన్ఫెక్టివ్‌ ఆర్థరైటిస్ అంటారు. సొరియాసిస్‌ వంటి చర్మ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపు, నొప్పి పలకరించవచ్చు. దాన్ని సొరియాటిక్‌ ఆర్థరైటిస్ అంటారు. అలాగే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా కీళ్ల వాపు రావచ్చు.దాన్ని రియాక్టివ్‌ ఆర్థరైటిస్ అంటారు. చికున్‌గన్యా వంటి వైరల్‌ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపులు రావచ్చు, వీటిని వైరల్‌ రియాక్టివ్‌ ఆర్థరైటిస్ అంటారు. ఇలా కీళ్ల వాపుల్లో ఎన్నో రకాలున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన, స్పష్టమైన కారణంతో వచ్చే కీళ్ల నొప్పులు.

What are the possible causes of arthritisవీటికి భిన్నంగా… స్పష్టమైన కారణమేదీ తెలియకుండానే ఆరంభమయ్యే అతి పెద్ద సమస్య… రుమటాయిడ్‌ ఆర్థరైటిస్ కీళ్లవాతం. ఇది ఎవరికి, ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటి వరకూ తెలియదు. కానీ ప్రతి వంద మందిలో ఒకరిని వేధిస్తోంది. ఒకసారి దీని బారిన పడ్డారంటే.. కీళ్లు ఎర్రగా వాచిపోతాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. తీవ్రమైన నొప్పితో జీవితం నరక ప్రాయమవుతుంది. పైగా వేళ్లు, మణికట్టు వంటి చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పీడించే ఈ కీళ్లవాతం.. దీర్ఘకాలం ఉండిపోయే సమస్య. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలు కూడా ప్రభావితమై పరిస్థితి మరింత విషమిస్తుంది. అదృష్టవశాత్తూ- దీన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకువచ్చి.. తిరిగి హాయిగా జీవితం గడిపేలా తోడ్పాటునిచ్చే అత్యాధునిక చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

What are the possible causes of arthritisఆర్థరైటిస్‌కి సమస్య ఉన్న వాళ్లలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిటేషన్ తీసుకుంటే సరి పోతుంది అలానే మన ఇంట్లో ఉండే మూలికలు కూడా ఈ నొప్పిని కంట్రోల్ చేస్తాయి. అయితే వీటిని కనుక మీరు పాటించారు అంటే ఆర్థరైటిస్ నుంచి మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం…!

అల్లం:

అల్లం చాలా సమస్యలను నయం చేస్తుంది. అల్లంలో స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. దీనిని వివిధ రకాల వంటల్లో ఉపయోగించుకోచ్చు. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లం తో కనుక టీ చేసి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యల్ని చిటికె లో అల్లం పోగొడుతుంది. ఆర్థరైటిస్ సమస్య కూడా పోతుంది. పైగా మీకు దీనితో చక్కటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

What are the possible causes of arthritisఅల్లం టీ కోసం మీరు ముందుగా నీళ్లను మరిగించుకుని దానిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి బాగా మరిగిన తర్వాత వడకట్టి తీయదనం కోసం కొద్దిగా తేనే వేసుకుని తీసుకుంటే బాగుంటుంది. అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నం చేసి చూసిన కూడా మీకు మంచి లాభాలు ఉంటాయి.

పసుపు:

పసుపులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇది అనారోగ్య సమస్యలను కూడా తరిమికొట్టడానికి ఉపయోగ పడుతుంది. పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పసుపు వల్ల చాలా బెనిఫిట్స్ మనకి లభిస్తాయి. మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే పసుపును ఉపయోగించడం మంచిది. కేవలం ఆర్థరైటిస్ నొప్పి తొలగించడానికి మాత్రమే కాకుండా దీని వల్ల మనకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే మీరు పసుపు ఎలా తీసుకోవచ్చు అంటే.. ముందుగా పాలని మరిగించి ఆ పాలల్లో పంచదార తో పాటు ఒక చిటికెడు పసుపు వేసి తీసుకోవచ్చు.

What are the possible causes of arthritisదీని వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి లేదా మీరు వేడి నీళ్లను మరిగించి దానిలో చిటికెడు పసుపు వేసి తీసుకున్నా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఆర్థరైటిస్ నొప్పి తొలగించుకోవడానికి పసుపు ని ఉపయోగించండి. దీనితో రిలీఫ్ గా ఉంటుంది.

గ్రీన్ టీ:

What are the possible causes of arthritisగ్రీన్ టీ బరువు తగ్గడానికి బాగా ఉపయోగ పడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి పైగా ఇది ఇంఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది. అలానే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్య కూడా తగ్గిపోతుంది కాబట్టి ప్రతి రోజు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. దీనితో ఉపశమనం లభించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు గ్రీన్ టీ తీసుకోవడం మర్చిపోకండి.

యూకలిప్టస్:

What are the possible causes of arthritisయూకలిప్టస్ వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆర్థరైటిస్ నొప్పిని పోగొట్టడం లో వీటి ఆకులు బాగా పని చేస్తాయి. ఈ ఆకులు ఉపయోగిస్తే స్వెల్లింగ్ మరియు నొప్పి కూడా పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఒకసారి ఈ ఆకుల్ని ఉపయోగించేటప్పుడు టెస్ట్ చేసుకుని అప్పుడు ఉపయోగించండి. యూకలిప్టస్ ఆయిల్ ని కూడా మీరు ఉపయోగించవచ్చు యూకలిప్టస్ ఆయిల్ వల్ల జలుబు, బ్రాంకైటిస్ కూడా తగ్గిపోతుంది.

అలోవేరా:

What are the possible causes of arthritisఅలోవెరా చర్మ సంబంధిత సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది. అలోవెరా లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఎన్నో చర్మ సంబంధిత సమస్యలని కూడా ఇట్టే తరిమికొడుతుంది. తాజా అలోవెరా జెల్ ని తీసుకుని మీరు ఉపయోగించడం వల్ల మీకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.

హోం మేడ్ ఫేస్ ప్యాక్ లో కూడా దీనిని ఉపయోగించవచ్చు. మీరు అలోవెరాని కావాలంటే డైరెక్టుగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా ఉపయోగించినా మీకు ఆర్థరైటిస్ నొప్పి తగ్గి పోతుంది కాబట్టి ఆర్థరైటిస్ నొప్పిని తొలగించుకోవడానికి మీరు కలబంద గుజ్జును కూడా వాడొచ్చు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స కూడా ఉండవు

What are the possible causes of arthritisపురుషులతో పోల్చుకుంటే మహిళల్లో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మధ్య వయసులో ఇది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఒక కుటుంబంలో ఎవరికైనా వస్తే మరొకరికి వచ్చే అవకాశం కూడా ఉంది. అలానే ఎప్పుడూ కూడా వీలైనంత విశ్రాంతి తీసుకోవడం మంచిది జాయింట్‌లో మూమెంట్ ఉండటం మంచిది. జాయింట్‌లో మూమెంట్ ఉండాలి అంటే మీరు కాస్త వ్యాయామం చేయాలి. రోజు మీరు వ్యాయామం చేస్తే కండరాలు బలపడతాయి మరియు జాయింట్స్‌లో ప్రెషర్ తగ్గుతుంది కావాలంటే మీరు యోగా లాంటివి కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. దీని వల్ల కూడా మీరు ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి వీలవుతుంది.

What are the possible causes of arthritisఎక్కువగా మీరు ఒత్తిడికి లోనైన ఎక్కువ పని చేసిన కాస్త విశ్రాంతి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంఫ్లేమేషన్ తగ్గుతుంది. అలానే నొప్పి తగ్గుతుంది మరియు అలసట కూడా పూర్తిగా తగ్గి పోతుంది మీరు ఐస్ బ్యాగ్ లేదా కోల్డ్ కంప్రెస్ ని ఉపయోగించడం వల్ల కూడా బెనిఫిట్ పొందొచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల మీకు ఇంఫ్లేమేషన్ తొలగిపోతుంది మరియు నొప్పి కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు దానిని కూడా ఉపయోగించ వచ్చు.

అదే విధంగా మీరు మీ డైట్ పై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం. మీ డైట్‌లో ఎక్కువగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేట్టు చూసుకోండి. ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఫ్యాటీ ఫిష్, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ నుంచి అందుతుంది. కాబట్టి ఈ పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కూడా మీకు మేలు చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ సి మరియు సెలీనియం వంటి వాటి వల్ల కూడా ఇంఫ్లేమేషన్ తగ్గుతుంది కాబట్టి మీరు అవి ఉండే ఆహారం కూడా ప్రిఫర్ చేయొచ్చు.

Health problems caused by doing these things immediately after a mealఏది ఏమైనా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తో పాటు జీవన విధానాన్ని కూడా మార్చుకోవడం చేయాలి. అవసరమైన మెడికేషన్ ని వాడడం, ఇబ్బందిగా ఉన్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం లాంటివి మర్చిపోకండి. ఇలా మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే నొప్పి నుంచి త్వరగా బయట పడవచ్చు పైగా ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. అందుకని ఈ విధంగా మీరు అనుసరించడం మంచిది. ఇలా చేస్తే ఆర్థరైటిస్ తో పెద్దగా ఇబ్బంది ఉండదు పైగా నొప్పి కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ హోమ్ రెమిడీస్ ని మీరు పాటించి ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం పొందండి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR