జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలు ఏమిటి ?

ఈ రోజులలో వయసు మళ్ళిన వారికే కాకుండా యుక్త వయసులో ఉన్న వాళ్లకు కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయి. సహజంగా జీర్ణ సమస్యలనగానే మనం తీసుకునే ఫుడ్స్ వల్లే అనుకుంటాం అది నిజం కూడా. అయితే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా జీర్ణ శక్తి తగ్గుతుంది. ఉదాహరణకు కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్లలో చాలా సమస్యలు వస్తున్నాయి అందులో అజీర్ణం, కడుపు ఉబ్బరం కూడా ఒకటి. మనం తీసుకునే ఆహారాల్లో ఆయిల్స్ అధికంగా ఉన్నా ఫ్యాట్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకున్నా పొట్ట సమస్యలు తప్పవు. ఆయిల్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ తినడం వల్ల కడుపుబ్బరం , ఇతర సమస్యలకు గురి అవుతారు. జీర్ణ సమస్యతో బాధపడుతున్నట్లు అనిపించిన వెంటనే, నొప్పి, ఉబ్బరాన్ని తగ్గించుకోవడకోసం మార్గాన్ని వెతుకుతారు. ఎందుకంటే పొట్ట సమస్యలు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో హోం రెమెడీస్ కు మంచిని మార్గం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇవి వెంటనే పొట్ట నొప్పి, కడుపుబ్బరం నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతాయి. జీర్ణ సమస్యలకు వివిధ రకాల కారణాలుంటాయి. వాటిన్నింటిలో ఆహారం ముఖ్య కారణం. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వట్లేదంటే, కడుపుబ్బరం, అసౌకర్యానికి దారితీస్తుంది.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలుఅలాగే జీర్ణ సమస్యలకు మరో కారణం వ్యాయమ లోపం మరియు పరిశుభ్రత లోపం, నిద్రలేమి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా జీర్ణసమస్యలకు కారణమవుతాయి. పొట్ట సమస్యలను కనుక వెంటనే చికిత్సను అందివ్వకపోతే, అది స్టొమక్ అల్సర్ కు దారితీస్తుంది. దాంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. జీర్ణ సమస్యలతో పాటు, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించే కొన్ని ఎఫెక్టివ్ నేచురల్ హోం రెమెడీస్ తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలుమంచి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. నీటిని ఎక్కువగా సేవించడం వల్ల అజీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలుకొన్ని పుదీనా ఆకులను తీసుకుని నమిలినా, వాటిని మరిగించి తయారు చేసిన ద్రవాన్ని తాగినా జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. జీర్ణాశ‌యంలో చల్లదనాన్ని పెంచడంలో పుదీనా బాగా ఉపయోగపడుతుంది. కడుపునొప్పిని కూడా తగ్గుతుంది.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలుఐదారు తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నమిలి అప్పుడు వ‌చ్చే ర‌సాన్ని మింగాలి. ఆ ర‌సం కడుపులో ఏర్పడే ఇబ్బందులను, అజీర్ణాన్ని, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది. తులసి ఆకుల్లో యాంటీ అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి గ్యాస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లను తగ్గిస్తాయి.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలుఆహారం ఎక్కువగా తిన‌డం వ‌ల్ల వ‌చ్చిన అజీర్ణ స‌మ‌స్య అయితే కొన్ని తమలపాకులను నమలాలి. ఇవి జీర్ణప్రక్రియను వేగవంతం చేసే ఎంజైమ్‌లను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీని వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్యలు తలెత్తవు.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలువాము ఆకులను నమిలినా జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. గ్యాస్ట్రిక్ జ్యూస్‌లను విడుదల చేయడంలో వాము ఆకు ఉపయోగపడుతుంది. వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కగా పనిచేస్తుంది.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలుమజ్జిగ కడుపులో ఆమ్ల తటస్థీకరణకు సహాయపడే లాక్టిక్ ఆమ్లం మజ్జిగలో ఎక్కువగా ఉంటుంది, తద్వారా అజీర్ణం తగ్గుదలలో సహాయపడుతుంది. మీరు అజీర్ణానికి గురైనప్పుడు చల్లని మజ్జిగ ఒక కప్పు త్రాగాలి.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలుదాల్చిన చెక్క మీ జీర్ణాశయం యొక్క కండరాలకు విశ్రాంతినిచ్చే క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది. ఒక కప్పు వేడి నీటిలో ఒక అంగుళo పొడవు ఉన్న దాల్చిన చెక్కను కానీ లేదా పొడిని కానీ జోడించండి. 5 నుండి 10 నిముషాలు నానబెట్టిన తర్వాత, కొంచం తేనేని జోడించి సేవించండి.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలుసోంపులో మీ కడుపు నుండి వాయువుని తొలగించడంలో సహాయపడే కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రతి భోజనం తర్వాత సోంపు (ఫెన్నెల్) గింజలను ఒక టీస్పూన్ తీసుకోవడం కూడా మంచిదే.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలుఅలోవెరా జ్యూస్ అలోవేరా రసం విటమిన్లు, ఖనిజాలు, మరియు అమైనో ఆమ్లాలతో నిండి ఉంటుంది, ఇది మీ శరీరానికి హాని చేసే పదార్ధాలను తొలగించుటలో సహాయం చేస్తుంది. మరియు జీర్ణక్రియను పెంచుతుంది.

జీర్ణ సమస్యలు రావడానికి గల కారణాలుకొబ్బరి నూనె కొబ్బరి నూనె, లారిక్ యాసిడ్ మరియు కాప్రిక్ యాసిడ్ వంటి సంతృప్త కొవ్వులు కలిగి ఉంటుంది. ఇది మీ కడుపుకు ఉపశమనం కలగజేస్తుంది. తద్వారా ఆపానవాయువులకు మరియు అజీర్ణ సంబంధిత సమస్యలకు తక్షణ ఉపశమనంగా ఉంటుంది. మీకు ఇష్టమైన పానీయం లేదా సలాడ్తో కొబ్బరి నూనె కలపి తీసుకోవచ్చు . లేదా కొబ్బరి నూనె తో వంట కూడా ప్రయత్నించవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR