మంగళ సూత్రాలలో ఉండే ముత్యం, పగడం విశేషం ఏంటో తెలుసా?

మంగళసూత్రం ధరించినందువల్ల మానవ జీవితంలో ఎంతో మంగళం జరుగుతుంది కాబట్టి ఈ సూత్రానికి అంటే ఒక సాధారణంగా కనిపించే మామూలు తాడుకు పసుపు పూసి కట్టిన తాడు కు మంగళసూత్రం అని పేరు వచ్చింది. స్త్రీ పురుషులు వివాహం ద్వారా ఒక కుటుంబంగా జీవించడానికి ఇష్టపడి ఈ సూత్రాన్ని ధరించడానికి స్త్రీ, దానిని ధరింప చెయ్యడానికి పురుషుడు అంగీకరించి వివాహం ( విశేషమైన వాహము అంటే విశేషమైన జీవన విధానానికి విశేషమైన జీవనానికి ఆధారం అవుతుంది కాబట్టి ఇది వివాహము అవుతుంది.

మంగళసూత్రంముఖ్యంగా ఆడవారు మంగళ సూత్రానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. తమ మెడలో ఉన్న సూత్రాలను పంచప్రాణాలుగా కాపాడుకుంటారు. అయితే మంగళసూత్రంలో ముత్యం,పగడం ధరింపజేసే సాంప్రదాయం మనకు పూర్వం నుండి వస్తుంది. దానికి తగు కారణాలను తెలుసుకుందాం…

మంగళసూత్రంముత్యం చంద్రగ్రహానికి ప్రతీకగా, దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందాలకు మరియు అన్యోన్యదాంపత్యానికి కారకుడు, శారీరకంగా నేత్రాలు, క్రొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనాలు, స్త్రీల గుహ్యావయవాలు, నరాలు, ఇంద్రియాలు, గర్భదారణ, ప్రసవాలకు కారకుడు.

మంగళసూత్రంకుజగ్రహ కారకంగా అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగం, ఋణపీడలు, అగ్ని మరియు విద్యుత్భయాలు, పరదూషణ, కామవాంఛలు, ధీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషం యిత్యాదులు మరియు శారీకంగా చూసినప్పుడు ఉదరం, రక్తస్రావం, గర్భస్రావం, ఋతుదోషములు మొదలైనవి. ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అంటే ఆరోగ్యమైన స్త్రీకి 28 రోజులకు ఖచ్చితంగా ఋతుదర్శనమవాలి. మన సాంప్రదాయంలో స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యానికి మించిన విలువైనది మరొకటి లేనేలేదు.

మంగళసూత్రందానికి తోడు జాతిపగడం ధరించడం వంటిది మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధం ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకొందాం…ముందుగా ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు అనగానే ఆపరేషన్ లేనిదే జరగటం లేదు ఇది సర్వసాధారణమైపోయింది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు(కుజుడు)తెలుపు (చంద్రుడు). అలా ధరించడం వల్ల స్త్రీ శరీరంలోని అన్ని నాడీకేంద్రాలను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ రెండు గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం మనకు కనపడదు.

మంగళసూత్రంకాబట్టి చంద్రకుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు సమకూర్చుతుంటాయి. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మనం మరువకూడదు. అందుకే తొలుతగా కుజదోషం ఉందా, లేదా అని చూస్తారు.ఇక ఆ స్త్రీ కి జాతక పరంగా కూడా ఆ గ్రహాలు శుభ ఫలాలను ప్రసాదించేవి అయితే మరింత శుభాలు ఆ స్త్రీ పొందే అవకాశం ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR