ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు..!
జీవితం నాకన్నా అందంగానే ఉంటుంది కదా…
మరి తన దగ్గర ఉండకుండా నా దగ్గరికి వస్తానంటావేంటి…?
ఇప్పటివరకూ వచ్చిన వీళ్ళతోనే ఏగలేక పోతున్నాను…
దానికి తోడు నువ్వేమో వచ్చి ఏదో పొడిచేద్దాం అన్నట్టు సిద్దపడిపోతున్నావు….
మోహమాటం లేకుండా చెప్తున్నా, వచ్చాక చాలా బాధపడతావు…
ఎందుకు నన్నింత బాధపెడుతున్నావు…?
నీలాంటి పిరికివాళ్ళతో నేను కలిసి ఉండలేను…
ఉన్నా ఆనందంగా ఉండలేను, ఆనందంగా ఉన్నట్టు కనిపించినా అది నటనే అవుతుంది…
అది నటన అని తెలిసిన రోజు నువ్వు ఇంకా ఎక్కువ బాధపడతావు…
నిన్ను ప్రేమించేవాళ్ళ విలువ నీకు తెలియదు…
నువ్వంటే అస్సలు ఇష్టం లేని నా దగ్గరకి వచ్చిన తరువాత అప్పుడు తెలుస్తుంది…
హు… ఇక అప్పటికి తెలిసినా ప్రయోజనం ఏమీ ఉండదులే…
నా అంతట నేను నచ్చి రావాలి, నీ కోసం 7, 8 దశాబ్దాల పాటు వేచి ఉండే ప్రేమ నాది అయ్యుండాలి…
ఏదైనా దానంతన అదే జరగాలి గానీ, ఇలా బలవంత పెడితే నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది…
నీ అంతట నువ్వే వచ్చి, నన్నెందుకు చంపుతావు…
ఛీ…