గౌట్ అంటే ఏంటి? ఆ సమస్య నుండి ఎలా బయట పడాలి?

ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వలన పలు ఆరోగ్య సమస్యల బారిన పడాల్సివస్తుంది. మన శరీరంలో ‘యూరిక్‌ యాసిడ్‌’ జీవక్రియలు సరిగా లేనందువల్ల గౌట్‌ వ్యాధి వస్తుంది. ఇది ఒక రకమైన కీళ్లవ్యాధి. యూరిక్‌ యాసిడ్‌ రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టమవుతాయి. దాన్ని ‘గౌట్‌’ అంటారు.

goutకీళ్ల‌లో ఉండే స్ఫ‌టికాల వ‌ల్ల తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. మ‌నం తినే కొన్ని ర‌కాల ఆహారాల్లో ప్యూరిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. అయితే ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే దాంతో శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. ఈ క్ర‌మంలోనే కీళ్ల‌లో యూరిక్ యాసిడ్ చేరి అది స్ఫ‌టికాలుగా మారి గౌట్ స‌మ‌స్య వ‌స్తుంది. దీంతో నొప్పి ఇంకా ఎక్కువ‌వుతుంది.

jont painఈ వ్యాధి ఎక్కువగా పాదాల మీద ప్రభావం చూపిస్తుంది. తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. గౌట్ ఉంటే కాలి బొటన వేలి వద్ద వాపూ, పాదాల జాయింట్స్ వద్ద నొప్పిగా ఉంటాయి. కాలి వేళ్ళ వద్ద హఠాత్తుగా వచ్చే నొప్పిని గౌట్ ఎటాక్ అంటారు. ఈ ఎటాక్స్ వచ్చినప్పుడు పాదం మండిపోతున్నట్టు ఉంటుంది. మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది.

goutకొంత మందికి బ్లడ్ లో చాలా ఎక్కువ యూరిక్ ఆసిడ్ ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు కనపడవు. దాన్ని ఎసింప్టమాటిక్ గౌట్ అంటారు. జాయింట్స్‌లో యూరిక్ యాసిడ్ చేరిన తరువాత కనపడే లక్షణాలు మూడు నుంచి పది రోజుల వరకూ ఉంటాయి. జాయింట్స్ వెచ్చగా ఉండడంతో పాటూ భరించలేనంత నొప్పీ, వాపూ ఉంటాయి. గౌట్‌ని త్వరగా ట్రీట్ చేయకపోతే అది క్రానిక్ గా మారుతుంది. ఆ తర్వాత టోఫస్ అనే గట్టిగా ఉండే గడ్డలు జాయింట్స్ దగ్గర ఏర్పడి వాటిని పర్మినెంట్ గా డామేజ్ చేస్తాయి. ఈ గౌట్ వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా మారకుండా ఉండేందుకు సరైన టైమ్‌లో చికిత్స అవసరం.

alcohol habitకుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గౌట్ ఉంటే ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. మధ్య వయసు పురుషులు గానీ, మెనోపాజ్ దాటిన స్త్రీలకి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే రెడ్ మీట్, ఆర్గన్ మీట్ లాంటి ప్యూరీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటే, ఆల్కహాల్ అలవాటు ఎక్కువగా ఉంటే, కిడ్నీ డిసీజ్, థైరాయిడ్, హైబీపీ, డయాబిటీస్ లాంటి సమస్యలు ఉంటే ,డైయురెటిక్స్ లాంటి కొన్ని మందుల వల్ల కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

prawnsగౌట్ స‌మ‌స్య వ‌చ్చిన వారు ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు వైద్యులు ఇచ్చే మందుల‌ను వాడాలి. దీంతోపాటు ఆహారంలోనూ ప‌లు మార్పులు చేసుకోవాలి. కొన్ని ర‌కాల ప‌దార్థాల‌ను మానేయాల్సి ఉంటుంది. కొన్నింటిని తినాల్సి ఉంటుంది. గౌట్ స‌మ‌స్య ఉన్న‌వారు మ‌ద్యం సేవించ‌రాదు. సేవిస్తే యూరిక్ యాసిడ్ స్థాయిలు విప‌రీతంగా పెరిగిపోతాయి. మ‌ట‌న్‌, బీఫ్‌, పోర్క్ వంటి మాంసాహారాల‌ను తిన‌రాదు. వీటిల్లో ప్యూరిన్ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక వీటిని మానేయాలి. అలాగే చేప‌లు, రొయ్య‌లను తీసుకోరాదు. సోడాలు, శీత‌ల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్‌ల‌ను తిన‌రాదు.

miriyaluశరీరంలో యూరిక్ యాసిడ్ పెరగకుండా ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి ఏవమితో చూద్దాం. సొరకాయ, వాము, మిరియాలు తీసుకోవాలి. ముందుగా వామును దంచి దానిని పొడిచేసుకోవాలి. సొరకాయ పైన చెక్కుతీసి ముక్కలుగా చేసిఒక గ్లాసు జ్యూస్ చేసుకోవాలి. ఒక చెంచా వాముపొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఉదయాన్నే ఏమైనా తిన్న తర్వాత తాగితే చాలు. ఈ జ్యూస్ ఆయుర్వేదం ప్రకారం యూరిక్ యాసిడ్ను బయటకు పంపుతుంది. యూరిక్ యాసిడ్ విషపదార్థాలతో సమానం. శరీరంలో పెరిగేవ్యర్థాలను డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి అధికంగా ఉంటాయి. మూత్రపిండాల్లో, కాలేయంలో ఏర్పడే విషవ్యర్థాలను బయటకు పంపడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీనివలన ఎంత తీవ్రమైన గౌట్ సమస్యైనా తగ్గిపోతుంది. వాముపొడి, మిరియాల పొడివలన ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

giloyశరీరంలో వచ్చే వాపులను తగ్గించడంలో దోహదపడుతుంది. గిలాయ్ జ్యూస్ అంటే తిప్పతీగ జ్యూస్ ఇది కరోనా సమయంలో ఇమ్యూనిటి పెరగడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే ఎలాంటి అనారోగ్యాలనైనా తగ్గిస్తుంది. గౌట్ లాంటి సమస్యలు తగ్గడానికి తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగ అందుబాటులో లేకపోతే ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. యూరిక్ యాసిడ్ వలన డయాబెటిస్, ఒళ్ళునొప్పులు ఎక్కువగా పెరిగిపోతాయి. అలోవెరా జ్యూస్,ఆమ్లా జ్యూస్ కూడా బాగా పనిచేస్తాయి. అలోవెరా వలన రక్తశుద్ధి జరుగుతుంది. యూరిక్ యాసిడ్ బయటకు పోతుంది. ఉసిరి జ్యూస్లో లభించే విటమిన్ సి యూరిక్ యాసిడ్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపున తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR