సిరులు పండించే లక్ష్మీ గవ్వలు అంటే ఏమిటి? వాటి విశిష్టత ?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం గవ్వలను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. వాహనాలకు కూడా గవ్వలను కడుతూ ఉంటారు . అయితే గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవికి సోదరీ, సోదరులు గా భావిస్తారు.
లక్ష్మీదేవి సముద్రుడి కూతురు … అందువల్లనే సముద్రంలో లభించే గవ్వలు ఆమె చెల్లెళ్లనీ, శంఖాలు ఆమె సోదరులని అంటుంటారు.  ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు. గవ్వలు దృష్టి దోషాన్ని నివారిస్తాయనీ, ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయని అంటుంటారు.

gavvalu

అందువల్లనే గవ్వలను ధనాన్ని ఉంచే చోట … పూజా మందిరాల్లోనూ వుంచుతుంటారు. ఇక దృష్టి దోష నివారణకు గవ్వలను నూతన గృహాలకు … వాహనాలకు కడుతూ వుంటారు.
పూర్వం నాణాలకు బదులుగా గవ్వలు చెలామణిలో ఉండేవి. ఇప్పటికి కూడా డబ్బులేని సమయంలో చిల్లిగవ్వలేదని అంటూవుంటాం. దీపావళి రోజున లక్ష్మీదేవి వస్తుందని చాలామంది పూజలు నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో గవ్వలు ఆడుతూ లక్ష్మీ దేవిని ఆహ్వానించే ఆచారం కూడా వుంది.

పూర్వం క్షీర సాగరమథనం సమయంలో సముద్రంనుండి శ్రీమహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాళాహలం ఉద్భవించాయి అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె. గవ్వలు సముద్రంలో లభిస్తాయి గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరి, సోదరులు అని అంటారు.

gavvalu

మరి ఇంతటి విశిష్టత కలిగిన లక్ష్మీ గవ్వల ప్రత్యేకత మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపురంగులో మెరిసే గవ్వలను ‘లక్ష్మీ గవ్వలు’గా భావించి పూజిస్తారు.

గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంఖు, గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా కలుగుతాయి.

lakshmi gavvalu

లక్ష్మీగవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర, బీరువాలలో, అరలు (సేల్ఫ్స్)లోను పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. లక్ష్మీగవ్వలు ఉన్న ఇంట్లో సిరిసంపదలు, ధనాధ్యాలు వృద్ధి చెందుతాయి. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వల్ల లక్ష్మీదేవి తనంతట తానుగా ఆ ఇంట్లో నడిచి వస్తుంది అని నమ్ముతారు.

శివుడి జటాజూటంలో, నందీశ్వరుడి మెడలో కూడా గవ్వలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా వుంది.
చిన్నపిల్లలకి దృష్టిదోష నివారణకు మెడలోగాని మొలతాడులోగాని కడతారు.
వాహనాలకు నల్లని త్రాడుతో గవ్వలను కడితే దృష్టి దోషం ఉండదు.
భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి.
కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం.

పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రానామాలతో కుంకుమార్చాన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది.

డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వల్ల  రోజు రోజుకీ ధనాభివృద్ధి ఉంటుంది.

వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వల్ల వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి.

వివాహ సమయంలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు, కాపురం సజావుగా సాగుతుంది.

గవ్వలు శుక్ర గ్రహానికి సంబంధించినవి కావడంతో కామప్రకోపాలు, వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతలను గవ్వలతో పూజిస్తారు.

వశీకరణ మంత్రం పఠించే సమయంలో గవ్వలను చేతులలో ఉంచుకోవడం అత్యంత శ్రేష్ఠం.

ఎక్కడైతే ఎప్పుడూ గవ్వల గలగల ఉంటుందో అక్కడ  శ్రీమహాలక్ష్మీదేవి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR