కాకులకు పిండం పెట్టే ఆచారం వెనుక ఉన్న పురాణ కథ ఏంటి ?

మన హిందూ ధర్మంలో ఆచరించే ఉన్న ప్రతి ఆచారం వెనుక సైన్స్ తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయి. మన సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుండి పదో రోజు వరకు కాకులకు పిండం పెట్టడం చూస్తుంటాం, మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నాటి నుండే ఉంది, ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది.

Crowకర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు. ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారనీ, ఒక వేళ కాకి ముట్టనట్లైతే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ వుంటారు. ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దీని వెనుక కొన్ని పురాణ కథనాలు ఉన్నాయి.

కాకులకు పిండం పెట్టే ఆచారంపూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు. తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక, తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు. యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నారు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందువల్లనే ఈ నాటికీ పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు.

కాకులకు పిండం పెట్టే ఆచారంహిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు “ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం” అనే మంత్రాన్ని చదువుతారు, ఆ మంత్రానికి అర్థం “గాలిలో విహరించే పక్షుల, నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృ దేవతలకి ఆహారం అందించాలి ” అని. పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్ధం, పూర్వం మనుషులు నివసించే ప్రాంతాలలో కాకులే ఎక్కువగా జీవించేవి, అందుకే మన పూర్వికులు పిండప్రదానం చేసిన తరువాత కాకులకి ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాలలో ఉంది.

రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తుంటారు, కాకులకి ఆహారం పెడితే నీ పూర్వికులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు, రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR