మనకందరికి ఊహ తెలిసినప్పటి నుండి లక్ష్మీ అమ్మవారి పటాలను విగ్రహాలను చాలా చూసే ఉంటాము. కానీ ఎక్కడ చూసినా మనకు లక్ష్మీ అమ్మవారు తామరపుష్పం లో కూర్చున్నట్టే కనిపిస్తారు. లక్ష్మి దేవీ తామార పువ్వును ఆసనంగా చేసుకోవడానికి ఒక కారణం ఉంది. అదేమిటో చూడండి.
తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. అలాగే బురదలో నుంచి పుట్టినా పువ్వుకి మాత్రం బురద అంటకుండా స్వచ్ఛంగా బయటకు వస్తుంది. అలాగే జీవితంలో కూడా ఇతరుల విషయాలు పట్టించుకోకుండా సొంతంగా పైకి రావాలని ఈ పువ్వు సూచిస్తుంది.
అంతేకాదు సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకడలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం.