కురుక్షేత్రంలో ఉపపాండవుల ప్రస్థానం అర్ధాంతరంగా ఎందుకు ముగిసింది?

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది అనే విషయం అందరికి తెలిసిందే.ఈ యుద్ధం కురుక్షేత్రం అనే ప్రదేశములో జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. దాదాపు భారతదేశంలోని అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది.

ఉపపాండవులభగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది. పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రథసారథి శ్రీకృష్ణుడు రథాన్ని రణభూమిలో మోహరించిన రెండుసైన్యాల మధ్యకు తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది.

ఉపపాండవులఅయితే కురుక్షేత్రం లో పాండవుల పుత్రులు అయిదుగురు ఉపపాండవులు కూడా పాల్గొన్నారు. వారి శౌర్యం ఇప్పటికి మాట్లాడుకుంటారు. పాండవులకు, ద్రౌపదికి కలిగిన ఐదుగురు సంతానాన్ని ఉప పాండవులగా పిలుస్తారు. పాండవులకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పుత్రుడు జన్మించారు.

  • ప్రతివింధ్యుడు – (ధర్మరాజు పుత్రుడు)
  • శ్రుతసోముడు – (భీముని పుత్రుడు)
  • శ్రుతకర్ముడు – (అర్జునుని పుత్రుడు)
  • శతానీకుడు – (నకులుని పుత్రుడు)
  • శ్రుతసేనుడు – (సహదేవుని పుత్రుడు)

పూర్వజన్మలో ఈ ఉపపాండవులు ‘‘విశ్వులు’’ అనే దేవతలుగా వుండేవారు. వీరు ఈ విధంగా ఉపపాండవులుగా జన్మించడానికి ఒక పురాణకథనం కూడా వుంది. పూర్వం ఒకనాడు హరిశ్చంద్రుని భార్య అయిన చంద్రమతిని నగరం వదిలి వెళ్లాల్సిందిగా విశ్వామిత్రుడు శపిస్తాడు. అది చూసిన ఈ విశ్వవులు.. ‘‘ఋషులకు ఇంత కోపం పనికిరాదు’’ అని అనుకుంటారు. అది విన్న విశ్వామిత్రునికి కోపం మరింతగా పెరిగిపోతుంది. ఆ కోపంతో అతను విశ్వులకు నరులుగా జన్మించమని శపిస్తాడు.

ఉపపాండవులుఆ శాపంతోనే వీరు ఉపపాండవులుగా భూమిపై జన్మిస్తారు. మహాభారతంలోని పాండవులు, కౌరులకు మధ్య జరిగిన కురుక్షేత్రం సంగ్రామంలో ఈ ఉపపాండవుల పాత్ర ఎంతో మెరుగైనది. వీరికి సంబంధించిన ప్రస్తావనలు ఎన్నో వున్నాయి. ఆరవరోజు యుద్ధం జరుగుతున్న సమయంలో కౌరవులు… భీముడు, దృష్టద్యుమ్ములపై ఒకేసారి మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఆ సమయంలో పాండవుల పుత్రులయిన ఈ ఐదుగురు ఉపపాండవులు తమ పరాక్రమ బలంతో కౌరవులను పరుగులు తీయించారు. అందులో ముఖ్యంగా నకులునీ కుమారుడు అయిన శతానీకుని విన్యాసం ప్రతిఒక్కరిని మెప్పించింది.

ఉపపాండవులుఅలాగే పదహారవరోజు యుద్ధంలో ధర్మరాజు కుమారుడు అయిన ప్రతివింధ్యుడు తోమరంతో కౌరవ వీరుడైన చిత్రసేనని చంపేశాడు. వారు అతనిపై ప్రతిఘటించినప్పటికీ అతనిని ఓడించలేకపోయారు.
మరోవైపు… ద్రోణాచార్యుని కుమారుడు అయిన అశ్వత్థామ ఈ ఉప పాండవులను సంహారం చేస్తానని కౌరవ రాజు అయిన దుర్యోధనునికి మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారం అశ్వత్థామ ఈశ్వరదత్తమైన ఖడ్గంతో రాత్రి సమయంలో రహస్యంగా దాడిచేశాడు.

ఉపపాండవులుప్రతివింధ్యున్ని అడ్డంగా నరికేశాడు. శ్రుతసోముడి గొంతకోసి అతికిరాతకంగా చంపేశాడు. అర్జునుని కుమారుడు అయిన శ్రుతకర్ముని తలను నరికి, మొండాన్ని కాలుతో తన్నాడు. అలాగే నకులుడు, సహదేవుని కుమారులైన శతానీకుని, శ్రుతసేనుని దారుణంగా తలలు నరికి చంపేశాడు.

ఉపపాండవులుఈ విధంగా ఆ రాజు రాత్రి అశ్వత్థామ, కృతవర్మం, కృపాచార్యుడు ముగ్గురు కలిసి ధృష్టద్యుమ్నుడి శిబిరంలో పాండవ సేనను ఘోరంగా చంపేశారు. ఈ విధంగా ఉపపాండవుల ప్రస్థానం కురుక్షేత్రంలో అర్థాంతరంగా సమసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భీమార్జునులు వెంటనే అశ్వత్థామను పట్టుకుని, శిక్షించబోయారు. కానీ అతను గురువు పుత్రుడన్న ఒకే ఒక కారణంతో చంపకుండా.. అతని తలపైనున్న సహజసిద్ధమణిని తీసుకుని వదిలేశారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR