శ్రీ మహావిష్ణువు వరాహావతారము ఎత్తడానికి గల కారణం ఏంటో తెలుసా ?

0
2668

శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం పది అవతారాలు ఎత్తాడు. అందులో మూడవ అవతారమే వరాహావతారము. అయితే శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ఎందుకు ఎత్తాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

varaha avatharamజలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి శ్రీ మహావిష్ణవు వరాహరూపాన్ని దాల్చాడు. అయితే మహాప్రళయం సంభవించి భూమి జలంలో మునిగిపోయింది. అప్పుడు బ్రహ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పనచేశాడు. స్వాయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే అని భావిస్తూ, సర్వభూతాంతరాత్ముడైన పుండరీకాక్షుని స్మరించసాగాడు. అప్పుడు ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి విశ్వంభరోద్ధారణకై జన్మించాడు.

varaha avatharamఅప్పుడు యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ స్తుతించెను. దేవా, సనకసనందనాదుల శాప వశమున జయ విజయులు దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులై జన్మించి ఉన్నారు. హిరాణ్యాక్షుడు నేడు అఖిలలోక కంటకుడై, భూమిని తీసుకొని నీకై వెదకుచూ రసాతలమునకు పోయాడు అని బ్రహ్మ వివరించాడు.

varaha avatharamఆ పలుకులు విని యజ్ఞవరాహమూర్తి యను సర్వేశ్వరుడు, సముద్ర జలమును చీల్చి రసాతలమును ప్రవేశించి భూమిని సమీపించెను. ఆ జల మధ్యంలో సూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. అప్పుడు రాక్షస రాజు గుండెలు తల్లడిల్లునట్లు రణోత్సామున రంకెలు వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమయ్యారు. రణ రంగంలో హిరణ్యాక్షుని గద, శూలము శ్రీహరి ధీరత్వం ఎదుట వృథా అయ్యాయి. దాంతో హిరాణ్యాక్షుడు రోషోద్ధరుడై మాయా యుద్ధము ప్రారంభించాడు. భీకర మాయా చక్రమును భూచక్రముపై ప్రయోగించాడు. శ్రీహరి తన చక్రముతో మాయా చక్రాన్ని అడ్డగించారు. తన మాయలన్నియు కృతఘ్నునికి చేసిన ఉపకారమువలె పనిచేయకపోవుట గమనించిన హిరణ్యాక్షుడు వరాహమూర్తిపై లంఘించి తన బాహువులను చాచి, హరివక్షంపై బలం కొద్దీ పొడువగా, హరి తప్పించుకుని ఎదురు ముష్టి ఘాతం ఇచ్చాడు. ఆ దెబ్బకు దిర్దిరం దిరిగి, దిట చెడి, లోబడిన హిరణ్యాక్షుని కర్ణమూలమందు తన కోరలతో వరాహమూర్తి మొత్తెను. అంతట లీలవోలె శ్రీయజ్ఞ వరాహమూర్తి భూమిని తన కోరలపై నుంచి సముద్రము పైన దించి, నిలిపి, విశ్రాంతి వహింపజేసి తిరోహితుడయ్యాడు.

varaha avatharamఇలా శ్రీ మహావిష్ణువు వరహావతతారంలో హిరణ్య్యాక్షుడిని సంహరించి భూమిని, వేదాలను రక్షించాడని పురాణాలూ చెబుతున్నాయి.